Share News

TRAINY SP: నేరస్థులపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:32 PM

నేర విభాగంపై పోలీసు లు ప్రత్యేక దృష్టి సారించాలని ట్రైనీ ఎస్పీ, ఐపీఎస్‌ అధికారి అశ్విన మణిదీప్‌ పోలీసుల కు సూచించారు. ఆయన గురువారం పట్ట ణంలోని యూపీఎస్‌ పోలీస్‌స్టేషనను కళ్యాణ దుర్గం డీఎస్పీ రవిబాబుతో కలిసి తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషనలోని రికార్డులను పరిశీ లించారు.

TRAINY SP: నేరస్థులపై ప్రత్యేక దృష్టి పెట్టండి
Trainee SP speaking at Rayadurgam Police Station

- ట్రైనీ ఎస్పీ మణిదీప్‌ఫ పోలీస్‌ స్టేషన్ల తనిఖీ

రాయదుర్గం రూరల్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): నేర విభాగంపై పోలీసు లు ప్రత్యేక దృష్టి సారించాలని ట్రైనీ ఎస్పీ, ఐపీఎస్‌ అధికారి అశ్విన మణిదీప్‌ పోలీసుల కు సూచించారు. ఆయన గురువారం పట్ట ణంలోని యూపీఎస్‌ పోలీస్‌స్టేషనను కళ్యాణ దుర్గం డీఎస్పీ రవిబాబుతో కలిసి తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషనలోని రికార్డులను పరిశీ లించారు. ఈ సం దర్భంగా ట్రైనీ ఎస్పీ మా ట్లాడుతూ... ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్ర సరి హద్దు కావడంతో పోలీసులు నిత్యం అప్ర మత్తంగా ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అర్బన సీఐ జయనాయక్‌, రూరల్‌ సీఐ వెంకటరమణ సిబ్బంది పాల్గొన్నారు.

తాడిపత్రి: పట్టణంలో రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఏఎస్పీ రోహితకుమార్‌చౌదరి, అనంతపు రం ట్రైనీ అడిషనల్‌ ఎస్పీ అశ్వినిమణిదీప్‌ సూచించారు. వారు గురువారం పట్టణ పోలీస్‌స్టేషనను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా రౌడీషీటర్లకు కౌన్సె లింగ్‌ ఇచ్చారు. పట్టణంలో రౌడీషీటర్ల గ్యాంగ్‌లు ఎక్కువైనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్యాంగులు ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆ గ్యాంగులపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని స్థానిక పోలీసు అధికా రులకు సూచించారు. విజయవాడలో బ్యాంక్‌ మేనేజర్‌ భార్యను హత్య చేసిన కేసులో ముద్దాయి తాడిపత్రిలో నివాసం ఉంటున్నా డని, అతడి పై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. మర్డర్‌ కేసులో ముద్దాయిలుగా ఉన్నవారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. అనంతరం పలు అంశాలపై ఆయన స్థానిక పోలీసులతో చర్చించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 05 , 2026 | 11:32 PM