VIP: బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:59 PM
ఉన్నత పాఠశాల దశ లోనే అత్యుత్తమ ఫలితాలను సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విద్యార్థులకు సూచిం చారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల మైదా నంలో నిర్మించిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని ఆయన శనివా రం ప్రారంభించారు.
- విద్యార్థులకు ప్రభుత్వ విప్ కాలవ సూచన
బొమ్మనహాళ్, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ఉన్నత పాఠశాల దశ లోనే అత్యుత్తమ ఫలితాలను సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విద్యార్థులకు సూచిం చారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల మైదా నంలో నిర్మించిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని ఆయన శనివా రం ప్రారంభించారు. ఈ భవనాన్ని పునః నిర్మించిన స్థానిక జిందాల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ ప్రాంతం వారికి ఉద్యోగాల కల్ప న విషయంపై ఆ కంపెనీ ప్రతినిధులతో త్వరలో చర్చిస్తామని ఆయన తెలిపారు. అనంతరం బొమ్మనహాళ్‌లోని వెలుగు కార్యాలయంలో ప్ర జాదర్బార్ నిర్వహించారు.
మూడునెలల క్రితం నిర్వహించిన ప్రజాద ర్బార్‌లో 300కుపైగా అర్జీలు వస్తే ఇప్పుడు కేవలం 20 వచ్చాయని తె లిపారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలను తగ్గించామన్నారు. కార్యక్ర మంలో డీఎల్‌డీఓ నాగేశ్వరరావు, తహసీల్దార్ మునివేలు, ఎంపీడీవో విజయ భాస్కర్, టీడీపీ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కణేకల్లు: పల్లెల్లో స్వచ్ఛతకు ప్రాధాన్యమిచ్చి ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ కాలవ శ్రీని వాసులు పేర్కొన్నారు. ఆయన శనివారం మండలంలోని కణేకల్లు క్రాసింగ్‌లో నూతన స్వచ్ఛరథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అదే విధంగా ఆయన మండలంలోని రచ్చుమర్రి గ్రామంలో నూతనంగా ఏ ర్పాటు చేసిన వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
గ్రామంలో ఆంజనే యస్వామి గుడి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ఠకు విప్ హాజరయ్యారు. మండల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
రాయదుర్గం: కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమాతో తెలుగు దేశం పార్టీ భరోసా ఇస్తోందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. నియోజకవర్గం పరిధిలోని డీ హీరేహాళ్ మండలం, ఓబుళాపురానికి చెందిన వాసకోటి మంజునాథ్, అదే మండలం కాదలూ రుకు చెందిన వన్నూరుస్వామి పార్టీలో క్రియాశీలక సభ్యులుగా పనిచేస్తూ మృతి చెందారు. కాలవ శనివారం రాయదుర్గంలోని క్యాంప్ కార్యాలయంలో ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున మంజునాథ్ భార్య నేత్రావతి, వన్నూరుస్వామి భార్య నిర్మలమ్మ ఖాతాలకు ప్రమాద బీమా డబ్బు జమ చేయించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....