FIRE: దానిమ్మతోటకు నిప్పు
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:08 AM
మండల కేం ద్రంలోని తనకు చెందిన దా నిమ్మ తోటకు శుక్రవారం రా త్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని టీడీపీ నాయ కుడు విజయ్‌శెట్టి వాపోయా రు. దీంతో మూడు ఎకరా ల్లోని 1200 దానిమ్మ చెట్లు, డ్రిప్ వైర్లు, పైపులైన్లు మొ త్తం కాలి బూడిద అయ్యా యని తెలిపారు.
విడపనకల్లు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మండల కేం ద్రంలోని తనకు చెందిన దా నిమ్మ తోటకు శుక్రవారం రా త్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని టీడీపీ నాయ కుడు విజయ్‌శెట్టి వాపోయా రు. దీంతో మూడు ఎకరా ల్లోని 1200 దానిమ్మ చెట్లు, డ్రిప్ వైర్లు, పైపులైన్లు మొ త్తం కాలి బూడిద అయ్యా యని తెలిపారు. దాదాపు రూ. 20లక్షల వరకూ నష్టం కలిగినట్లు బాధితుడు విజయ్‌శెట్టి పేర్కొన్నారు. ఈ విషయమై విడపనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి పయ్యావుల కేశవ్ విజయ్ శెట్టికి ఫోనచేసి అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు.
కొత్తపల్లిలో మొక్కజొన్న పంట దగ్ధం
కణేకల్లు: మండలంలోని కొత్తపల్లి వద్ద ఇద్దరు రైతులు మూడె కరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట అగ్నిప్రమాదంలో దగ్ధమైం ది. దీంతో రూ. 3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాఽధిత రైతులు తెలిపారు. కొత్తపల్లికి చెందిన చిత్తన్న, లింగన్న ఒక్కొక్కరు 1.5 ఎ కరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. వీరిద్దరి పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. పంట ఏపుగా పెరిగి కోతకు వచ్చింది. ఇలాంటి పరిస్థితు ల్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో పంటతో పాటు పొ లంలోని డ్రిప్ పరికరాలు దగ్ధమైనట్లు బాధిత రైతులు వాపోయారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....