Share News

SCHOOL: ఆరుబయటే వంటకాలు

ABN , Publish Date - Mar 02 , 2026 | 11:56 PM

ప్రభుత్వం విద్యార్థుల సౌక ర్యార్థం కోట్ల రూపాయలు ఖ ర్చు పెడుతున్నా, అందు కో సం క్షేత్ర స్థాయిలో చేసిన ప నులు అర్ధాంతరంగా ఆగిపోవ డంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. విద్యార్థులకు సరైన సౌకర్యాలు అందడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

SCHOOL:  ఆరుబయటే వంటకాలు
Organizers cooking outdoors at school

- ఉడేగోళం పాఠశాలలో అసంపూర్తిగా వంటగది

రాయదుర్గం రూరల్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం విద్యార్థుల సౌక ర్యార్థం కోట్ల రూపాయలు ఖ ర్చు పెడుతున్నా, అందు కో సం క్షేత్ర స్థాయిలో చేసిన ప నులు అర్ధాంతరంగా ఆగిపోవ డంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. విద్యార్థులకు సరైన సౌకర్యాలు అందడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నాడు - నేడు పనుల కింద మండలంలోని ఉడేగోళం ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండేందుకు వంటగదితో పాటు రెండు మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. కాంట్రా క్టర్‌ పనులు ప్రారంభించారు. అయితే బిల్లులు సక్రమంగా పడకపోవ డంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ నిర్మా ణాలు పాఠశాలలో దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు బయటికి కాలకృత్యాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. అదే విధంగా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండేందుకు వంటగది లేకపోవడంతో, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ప్రతినిత్యం ఆరుబయటే వండుతున్నారని వాపోతున్నారు. బయట వంట వండడం వల్ల పొగ పాఠశాల వైపు వెళ్తుండడంతో విద్యార్థులు ఇబ్బంది పడు తున్నట్లు తెలిపారు. వారి విద్యాభ్యాసాని ఆటంకం కలుగుతోందని వాపో తున్నారు. ఇప్పటికైనా అధికా రులు స్పందించి వంటగది, మ రుగు దొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై హెచఎం ఫణీం ద్రనాథ్‌ను వివరణ కోరగా ప్ర భుత్వం నుంచి నిధులు విడు దల కాగానే నిర్మాణ పనులు పూర్తి అవుతాయని తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 03 , 2026 | 12:01 AM