PGRS: పీజీఆర్‌ఎస్‌కు అధికారుల డుమ్మా
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:08 AM
స్థానిక తహసీల్దార్ కార్యా లయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమంపై అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. అదేవి ధంగా సమస్యలు తెలిపేందుకు వచ్చే ప్రజలకు నిరాశ ఎదుర వుతోంది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగే పీజీఆర్‌ఎస్‌కు హాజరుకావాలని తహసీల్దార్, ఆర్‌ఐకి కలెక్టర్ నుంచి అదేశాలతో వారు అక్కడికి వెళ్తున్నారు.
బొమ్మనహాళ్, మార్చి 2(ఆంధ్రజ్యోతి): స్థానిక తహసీల్దార్ కార్యా లయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమంపై అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. అదేవి ధంగా సమస్యలు తెలిపేందుకు వచ్చే ప్రజలకు నిరాశ ఎదుర వుతోంది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగే పీజీఆర్‌ఎస్‌కు హాజరుకావాలని తహసీల్దార్, ఆర్‌ఐకి కలెక్టర్ నుంచి అదేశాలతో వారు అక్కడికి వెళ్తున్నారు. మిగిలిన శాఖల అధికారులు మండల కేంద్రంలో జరిగే పీజీఆర్‌ఎస్‌లో పాల్గొనాలని ఆదేశాలున్నా వీరు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయ్లఓ సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి కేవలం హౌసింగ్ ఏఈఈ వాసంతి మాత్రమే హాజరయ్యారు. మిలిన శాఖలకు చెందిన కొందరు అధికారులు సంతకాలు పెట్టి వెళ్లిపోగా, మరికొందరు పూర్తిగా గైర్హాజరయ్యారు. సమస్యలను విన్నవించేందుకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు సంబంధిత శాఖ అధికారులు లేకపోవడంతో నిరాశతో వెను దిరిగారు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వమే ప్రత్యేకంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమం ఉద్దేశమే వృథా అవుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజ రయ్యేలా ఉన్నతాధి కారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్ రాఘవేంద్రను వివరణ కోరగా... పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో మండలంలోని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరిస్తున్నామని తెలిపారు. అయితే మిగిలిన విషయా లపై తహసీల్దార్ చెప్పాల్సి ఉంటుందని సమాధానం దాటవేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....