Share News

RO PLANT: నిరుపయోగంగా ఆర్వో ప్లాంట్‌లు

ABN , Publish Date - Feb 28 , 2026 | 11:53 PM

విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రూ. లక్షలు వెచ్చించి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు ప్రస్తుతం మరమ్మతులకు చేరుకున్నాయి. దిష్టిబబొమ్మలా దర్శనమిస్తున్నా యి. పట్టణంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలో ఒకటో తరగ తి నుంచి తొమ్మిదో తరగతి వరకు 325 మంది విద్యార్థులు చదువు కుంటున్నారు.

RO PLANT: నిరుపయోగంగా ఆర్వో ప్లాంట్‌లు
In Municipal School, Rayadurgam Students who brought drinking water from home

తాగునీటి కోసం విద్యార్థుల అవస్థలు

రాయదుర్గంరూరల్‌, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రూ. లక్షలు వెచ్చించి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు ప్రస్తుతం మరమ్మతులకు చేరుకున్నాయి. దిష్టిబబొమ్మలా దర్శనమిస్తున్నా యి. పట్టణంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలో ఒకటో తరగ తి నుంచి తొమ్మిదో తరగతి వరకు 325 మంది విద్యార్థులు చదువు కుంటున్నారు. వారికి తాగునీ టి సౌకర్యార్థం 2020-21 వి ద్యా సంవత్సరంలో రూ. 2 లక్షలు వెచ్చించి పాఠశాలలో ఆర్వోప్లాంట్‌ను ఏర్పాటు చేశా రు. కొంతకాలంగా అది మర మ్మతులకు నోచుకోక నిరుప యోగంగా ఉంది. పలుమార్లు సంబంధిత కంపెనీ ప్రతిని ధులకు సమాచారం అందించి నా వారు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతు న్నారు. దీంతో విద్యార్థులు ప్రతిరోజూ ఇళ్ల నుంచి బాటిళ్లలో నీటిని తెచ్చుకుని తాగుతున్నట్లు వి ద్యార్థుల తల్లిదండ్రులు వాపో తున్నారు.


ఇప్పటికైనా సంబం ధిత అధికారులు స్పందించి ఆర్వోప్లాంట్‌కు మరమ్మతులు చేయించి విద్యార్థులకు స్వచ్ఛ మైన తాగునీటిని అందించా లని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

కుందుర్పి: మండల వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం శుద్ధి నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్‌లు పని చేయక దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. దీంతో ఆ పాఠశాలల్లో విద్యార్థులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలతో పాటు ఎనుములదొడ్డి, వడ్డిపాళ్యం, కరిగానపల్లి పాఠశాలలో వాటర్‌ ప్లాంట్‌లు పనిచేయడం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని వాటర్‌ ప్లాంట్ల మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తద్వారా విద్యార్థులు తాగునీటి సమస్య పరిష్కరించే విధంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 28 , 2026 | 11:53 PM