YCP: అభివృద్ధికి వైసీపీ మోకాలడ్డు
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:03 AM
పట్టణంలో సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు కేటాయించిన నిధులపై వైసీపీ డీసెంట్ నోటీసు ను సమర్పించి రూ. 3 కోట్ల అభివృద్ధిని అడ్డుకుంది. స్థానిక ము న్సిపల్ కౌన్సిల్ హాల్‌లో శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని ఛైర్‌పర్సన పొరాళు శిల్ప అధ్యక్షతన నిర్వహించారు. 28వ వార్డు కౌన్సిలర్ గోవింద రాజులు అజెండాలోని 5వ అంశంగా ఉన్న రూ. 3 కోట్ల అభివృద్ధి పనులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
- కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ల డీసెంట్ నోటీసు
- రూ. 3 కోట్ల అభివృద్ధి పనుల తిరస్కరణ
రాయదుర్గం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): పట్టణంలో సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు కేటాయించిన నిధులపై వైసీపీ డీసెంట్ నోటీసు ను సమర్పించి రూ. 3 కోట్ల అభివృద్ధిని అడ్డుకుంది. స్థానిక ము న్సిపల్ కౌన్సిల్ హాల్‌లో శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని ఛైర్‌పర్సన పొరాళు శిల్ప అధ్యక్షతన నిర్వహించారు. 28వ వార్డు కౌన్సిలర్ గోవింద రాజులు అజెండాలోని 5వ అంశంగా ఉన్న రూ. 3 కోట్ల అభివృద్ధి పనులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పనులకు సంబంధిం చిన డీసెంట్‌నోటీసును సమర్పించారు. దీనికి తోడు ఛైర్‌పర్సన కూడా గొంతు కలిపి పనుల నిర్వహణపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసి తిరస్కరించారు. ముఖ్యంగా ఇప్పటికే పట్టణంలో బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్, 15వ ఆ ర్థిక సంఘం, డీఎమ్‌ఎఫ్ నిధుల తో అభివృద్ధి పనులు చేపట్టిన వార్డులలో కాకుండా మిగిలిన వార్డుల్లో రూ. 3 కోట్ల పనులను కేటా యించారని వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పను లకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేయలేదు. అనంతరం పట్టణం లోని కూరగాయల మార్కెట్‌లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న కాంప్లెక్స్ భవనాల్లో నాలుగింటిని వేలం ద్వారా లీజుకు పొందిన ఎనిమిదో అంశా న్ని కూడా వాయిదా వేశారు. మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని అధి కారులు చెప్పినా వైసీపీ కౌన్సిలర్లు తీర్మానాన్ని వాయిదా వేశారు. ముఖ్యంగా దీనిపై టీడీపీ కౌన్సిలర్లు ప్రశాంతి, జ్యోతి మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి కలిసి రావాల్సింది పోయి అడ్డుకోవడం సబబు కాదన్నారు. వైసీపీ హయాంలో చేయలేని పనులు కూటమి ప్రభుత్వం చేస్తున్నందుకు సంతోష పడకుండా అడ్డుకోవడాన్ని విమర్శించారు. అదే విధంగా పట్టణంలో తాగునీటి సమస్య ఉత్పన్న మైందని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాగు నీటి పైపులైన లీకేజీల కారణంగా అంతరాయం ఏర్పడిందని కమిషనర్ దివాకర్‌రెడ్డి తెలిపారు. అయితే లీకేజీలను అరికట్టామని, తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామని ఆయన వెల్లడించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....