Home » Rayadurg
విద్యార్థి దశలోనే క్రీడల్లో నైపుణ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించు కోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. రాయదుర్గం రూరల్ పరిధిలోని పల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రెసోనీ అనే విద్యుత సంస్థ బహూకరించిన క్రికెట్ కిట్లను బుధవారం ఆ యన విద్యార్థులకు పంపిణీ చేశారు.
డీ. హీరేహాళ్ మండల తహసీల్దార్ కార్యాలయానికి పనుల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి ఎదురు చూసినా అధికారులు, వీఆర్‌ఓలు అం దుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయమే కార్యాలయానికి చేరుకునే ప్రజలు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
మండలంలోని డొనేకల్లు గ్రామ సచివాలయ సిబ్బందికి సమయం పాలన లేకుండా పోతోంది. సో మవారం ఉదయం 10.30 గంటలైనా ఆ సచివాలయం వాకిలి తెరవక పోవడమే అందుకు నిదర్శనం. డొనేకల్లు గ్రామానికి చెందిన కొంత మం ది నాయకులు పనుల నిమిత్తం సోమవారం సచివాలయం వద్దకు వెళ్లారు.
మండల పరిషత ఖాతాలో ఉన్న రూ. 7లక్షల నిధులు ఏమయ్యాయంటూ మండల వైస్ ఎంపీపీ లీలావతి ఎంపీడీవో విజయసింహారెడ్డిని ప్రశ్నించారు. మండల పరిషత కార్యాలయంలో శనివారం ఎంపీపీ వండ్రప్ప అధ్యక్షతన ఎంపీడవో విజయసింహారెడ్డి సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
మండల కేంద్రమైన డీ.హీరేహాళ్‌లో వ్యవసాయ శాఖ కార్యాలయం ఉందా? లేక ఎప్పుడూ మూసే ఉంటుందా అన్న సందేహాలు ప్రజల నుంచి వ్యక్తమ వుతున్నాయి. కార్యాలయం తరచూ మూతపడి ఉండడం, అధికారులు అందుబాటులో లేకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభూ జబుకేశ్వరస్వామి రథోత్సవాన్ని గురు వారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు స్వామి వా రికి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు. రథంలో స్వామివా రిని ప్రతిష్ఠించి పట్టణలో ఊరేగించారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంట్ ఉభయసభ లలో బిల్లు ఆమోదం పొందడంతో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వినాయక సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేల్చి కేక్ కట్ చేశారు.
మండలంలోని ఎల్బీనగర్ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో విద్యుత శాఖ నిర్లక్ష్యం బహిర్గత మవుతోంది. 11 కేవీ విద్యుత లైనకు చెందిన స్తంభాలు అధ్వాన స్థితికి చేరుకుని, రైతుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. ఒక స్తంభం పూ ర్తిగా వంగిపోగా మరొకటి అడుగుభాగం పగిలి లోపలి ఇనుప కడ్డీలు బయటకు కనిపిస్తున్నాయి.
పరస్పర సహకా రంతోనే పేదరికం లేని సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం డ్వామా కార్యాలయంలో డీఎల్‌డీవో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పీ-4 సర్వే వార్షికోత్సవాన్ని నిర్వ హించారు.
మండలకేంద్రంలో గురు వారం పోలీసుల సమక్షంలో గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. మం డలంలో వంట గ్యాస్ సమస్య రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసినప్పటికీ సకాలంలో అందకపో వడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.