GAS: గ్యాస్ పంపిణీలో గందరగోళం
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:10 PM
మండలకేంద్రంలో గురు వారం పోలీసుల సమక్షంలో గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. మం డలంలో వంట గ్యాస్ సమస్య రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసినప్పటికీ సకాలంలో అందకపో వడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- పోలీసుల సమక్షంలో పంపిణీ
బొమ్మనహాళ్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో గురు వారం పోలీసుల సమక్షంలో గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. మం డలంలో వంట గ్యాస్ సమస్య రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసినప్పటికీ సకాలంలో అందకపో వడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజన్సీ నిర్వాహుకు లు డెలివరీ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని దేవరిగి క్రాస్‌కు చెందిన ఓ వినియో గదారుడు గత శుక్రవారం ఇండేన గ్యాస్ కోసం బుక్ చేయగా 24 గంట ల్లో డెలివరీ అయితే రోజులు గడిచినా సిలిండర్ అందలేదు. గురువారం బొమ్మన హాళ్‌కు వచ్చిన డెలివరీ బాయ్‌ను సంప్రదింగా రిజెక్ట్ అయిం ది. మరో సారి బుక్ చేయండి. రెండు రోజుల తర్వాత ఇస్తాను అని చెప్పడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు ఇలాంటి సమస్యలు పలువురు వినియోగదారులకు ఎదురవు తున్నాయని తెలుస్తోంది. బుక్ చేసినా గ్యాస్ అందకపోవడం, డెలివరీలో ఆలస్యం, సరైన సమా చారం ఇవ్వకపోవడం వంటి అంశాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గురువారం బొమ్మనహాళ్‌లో పోలీస్‌స్టేషన ఎదురుగానే పోలీసుల సమక్షంలో ఇండేన గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. దేవగిరి క్రాస్‌కు చెందిన ఆ వినియో గదారుడు కూడా అక్కడికి వెళ్లి పోలీసుల సమక్షంలోనే సిలిండర్ తీసుకోవాల్సి వచ్చింది.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....