Share News

TIME: సమయ పాలన ఏదీ..?

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:46 PM

మండలంలోని డొనేకల్లు గ్రామ సచివాలయ సిబ్బందికి సమయం పాలన లేకుండా పోతోంది. సో మవారం ఉదయం 10.30 గంటలైనా ఆ సచివాలయం వాకిలి తెరవక పోవడమే అందుకు నిదర్శనం. డొనేకల్లు గ్రామానికి చెందిన కొంత మం ది నాయకులు పనుల నిమిత్తం సోమవారం సచివాలయం వద్దకు వెళ్లారు.

TIME: సమయ పాలన ఏదీ..?
Secretariat which does not open till 10.30 am

విడపనకల్లు, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని డొనేకల్లు గ్రామ సచివాలయ సిబ్బందికి సమయం పాలన లేకుండా పోతోంది. సో మవారం ఉదయం 10.30 గంటలైనా ఆ సచివాలయం వాకిలి తెరవక పోవడమే అందుకు నిదర్శనం. డొనేకల్లు గ్రామానికి చెందిన కొంత మం ది నాయకులు పనుల నిమిత్తం సోమవారం సచివాలయం వద్దకు వెళ్లారు. ఉదయం 10.30 గంటలైనా సచివాలయం సిబ్బంది ఒక్కరూ రాకపోవటంతో, వారు తలుపులు తెరవని సచివాలయాన్ని, రైతు సేవా కేంద్రాన్ని ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేశారు. సిబ్బం ది నిర్లక్ష్యంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఉదయం 10.30 అయినా సచివాయం తాళం తెరవక పోవడం ఏమిటని ప్రశ్నించారు. గ్రామ కార్యదర్శికి(పంచాయతీ కార్యదర్శి) కూడా బాధ్యత లేదా? అని మండిపడ్డారు. మిగిలిన సిబ్బందికి కూడా సమయ పాలన లేకుండా పోతోందన్నారు. గ్రామాల్లో సిబ్బంది సక్రమంగా ఉండేలా చూ డాలని మండల అధికారులను కోరారు. ఈ విషయమై ఎంపీడీవో చల్లా రాధాకృష్ణను వివరణ కోరగా... డొనేకల్లులో సర్వేలు నిర్వహిస్తున్నందున సిబ్బంది సచి వాలయానికి వెళ్లలేక పోయి ఉంటారని తెలిపారు. దీనిపై పూర్తిగా విచారించి విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. డొనేకల్లు పంచాయతీ కార్యదర్శి 12 గంటలకు విడపనకల్లు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారని, ఆయన ఎక్కడి నుంచి వచ్చారనేది విచారి స్తామని అన్నారు. ఏదిఏమైనా పనివేళకు కచ్చితంగా ఎవరో ఒకరు కార్యలయంలో ఉండాలని,. ఆ విధంగా ఎవ్వరూ లేకపోయినా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు.

Updated Date - Apr 06 , 2026 | 11:46 PM