GOD: కన్నులపండువగా రథోత్సవాలు
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:24 AM
పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభూ జబుకేశ్వరస్వామి రథోత్సవాన్ని గురు వారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు స్వామి వా రికి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు. రథంలో స్వామివా రిని ప్రతిష్ఠించి పట్టణలో ఊరేగించారు.
రాయదుర్గం రూరల్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభూ జబుకేశ్వరస్వామి రథోత్సవాన్ని గురు వారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు స్వామి వా రికి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు. రథంలో స్వామివా రిని ప్రతిష్ఠించి పట్టణలో ఊరేగించారు. ప్రభుత్వ విప్ కాలవ శ్రీని వాసులు హాజరై, రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈవో నరసింహారెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనా రాయణ, పురోహితులు రామకృష్ణ ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు.
విడపనకల్లు : మండలం కేంద్రంలో సుంకులమ్మ దేవి, దేవమ్మ దేవి రథోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం అమ్మవారికి గంగపూజ చేశారు. అమ్మవారిని గురువా రం ఉదయం ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు చేశారు. అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రథంలో ఉంచి ఊరేగించారు. అలా గే మండలంలోని హావళిగి గ్రామంలో జంబులింగేశ్వర స్వామి ర థోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. హంపిలో నిర్వ హించే వేడుకల సందర్భంగా హావళిగిలోను జంబులింగేశ్వర స్వామి వేడుకలు నిర్వహిస్తారు.
ఉరవకొండ: పట్టణంలో మల్లేశ్వరస్వామి రథోత్సవాన్ని గురువా పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను రథంపై అధిష్టించి, రథాన్ని చాబాల రోడ్డు వరకూ లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. అలాగే ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో, వజ్రకరూరు మండలంలోని చాయాపురంలో సుంకలమ్మదేవి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
గుంతకల్లుటౌన: పట్టణంలోని పాత గుత్తిరోడ్డులో వెలసిన అంబమ్మ దేవత రథోత్సవాన్ని గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి విశేషపుష్పాలంకరణ చేసి పూజలు చేశారు. సాయంత్రం రథాన్ని విశేషంగా అలంకించి అంబమ్మ దేవతను కొలువుదీర్పిచ రథోత్సవం నిర్వహించారు.