MLA: పరస్పర సహకారంతో పేదరికం లేని సమాజం : ఎమ్మెల్యే కాలవ
ABN , Publish Date - Mar 30 , 2026 | 11:39 PM
పరస్పర సహకా రంతోనే పేదరికం లేని సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం డ్వామా కార్యాలయంలో డీఎల్‌డీవో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పీ-4 సర్వే వార్షికోత్సవాన్ని నిర్వ హించారు.
రాయదుర్గంరూరల్, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పరస్పర సహకా రంతోనే పేదరికం లేని సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం డ్వామా కార్యాలయంలో డీఎల్‌డీవో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పీ-4 సర్వే వార్షికోత్సవాన్ని నిర్వ హించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాలవ హాజరై మాట్లాడారు. ని యోజకవర్గంలో కూడా దాతల సహ కారంతో పీ - 4 చేపట్టామన్నారు. పేదరికం లేని సమాజాన్ని నెలకొల్పడా నికి ఆర్థికంగా ఎదిగిన వ్యక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం నుంచి పీ - 4 సర్వేలో భాగంగా నియోజకవర్గంలో 8490 కుటుంబాలను గుర్తించా మని, 3026 మంది మార్గదర్శకులను ఎంపిక చేశామన్నారు. నియోజక వర్గంలో బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న వారిని సర్టిఫికెట్లు, శాలువ, పూలమాలలను వేసి సత్కరించారు. మార్కెట్‌యార్డ్ చైర్మన హనుమంతరెడ్డి, మండల కన్వీనర్ హనుమంతు, పట్టణ అధ్యక్షుడు బం డి క్రిష్ణమూర్తి, టంకశాల హనుమంతు, పొరాళు పురుషోత్తం, పసుపులే టి నాగరాజు, జిలాన, ఎంపీడీఓ కొండన్న, తహసీల్దార్ హరికుమార్, సీడీడీవో పద్మావతి, ఎంఈఓ ఇర్షాద్‌అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....