Share News

TIME: అందుబాటులో ఉండని అధికారులు

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:00 AM

డీ. హీరేహాళ్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయానికి పనుల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి ఎదురు చూసినా అధికారులు, వీఆర్‌ఓలు అం దుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయమే కార్యాలయానికి చేరుకునే ప్రజలు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

TIME: అందుబాటులో ఉండని అధికారులు
d. People waiting at Herehal Tehsildar's office

- ఇబ్బందులు పడుతున్నామంటున్న రైతులు, ప్రజలు

డీ. హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌), ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): డీ. హీరేహాళ్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయానికి పనుల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి ఎదురు చూసినా అధికారులు, వీఆర్‌ఓలు అం దుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయమే కార్యాలయానికి చేరుకునే ప్రజలు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వీఆర్‌వోలు గ్రామ సచివాలయంలోగానీ, గ్రామ రెవెన్యూ కార్యాలయంలో గానీ ఉండడం లేదని ప్రజలు అవేదన వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పలు గ్రామాలకు చెందిన ప్రజలు మంగళవారం అధికారుల కోసం ఎదురు చూశారు. 30 కిలో మీటర్లు దూరం ఉన్న గ్రామాల నుంచి వచ్చి, తహసీల్దార్‌ చాంబర్‌ కూడా తలుపులు వేసి ఉండడంతో చేసేది లేక బయట మెట్లపై కూర్చున్నారు. అధికారులు కార్యాలయ సమయాల్లో లేకపోవడం, ఉన్న సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల గందరగోళం నెలకొంది. మధ్యవర్తుల ద్వారా పనులు వేగంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కా ర్యాలయంలో క్రమశిక్షణ తీసుకురావాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

నేటి నుంచి అందుబాటులో ఉంటాం

- శ్రీనివాసులు, తహసీల్దార్‌, డీ.హీరేహాళ్‌

మేము సోమవారం సీఎం సమావేశా నికి వెళ్లాం. కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం ఉండడంతో మంగళవారం కార్యాల యానికి నేను రాలేదు. అందుకే అందుబాటులో లేము. బుధవారం నుంచి కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తాం. వీఆర్వోలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 08 , 2026 | 12:00 AM