Share News

MLA: విద్యార్థి దశలోనే నైపుణ్యం పెంచు కోవాలి

ABN , Publish Date - Apr 08 , 2026 | 11:58 PM

విద్యార్థి దశలోనే క్రీడల్లో నైపుణ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించు కోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. రాయదుర్గం రూరల్‌ పరిధిలోని పల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రెసోనీ అనే విద్యుత సంస్థ బహూకరించిన క్రికెట్‌ కిట్లను బుధవారం ఆ యన విద్యార్థులకు పంపిణీ చేశారు.

MLA: విద్యార్థి దశలోనే నైపుణ్యం పెంచు కోవాలి
MLA Kalava giving sports equipment to students

- ఎమ్మెల్యే కాలవ

రాయదుర్గం రూరల్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశలోనే క్రీడల్లో నైపుణ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించు కోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. రాయదుర్గం రూరల్‌ పరిధిలోని పల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రెసోనీ అనే విద్యుత సంస్థ బహూకరించిన క్రికెట్‌ కిట్లను బుధవారం ఆ యన విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ సామాజిక సేవలో కార్పొరేట్‌ సంస్థలు పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు. తన సూచన మేరకు రేసోని సంస్థ ప్రతినిధు లు రాయదుర్గం, డీ.హీరేహాళ్‌, కణేకల్లు మండలాల పరిధిలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్‌ కిట్లు అందజేయడం అభినందనీయమ న్నారు. అలాగే సామాజిక బాధ్యత కింద ఈ ప్రాంత ప్రజలకు ఉప యోగపడే పనులు చేపట్టాలని ఎనటీపీసీ, జిందాల్‌ లాంటి పెద్ద సంస్థలను కోరామన్నారు. ఈకార్యక్రమంలో రేపోనీ చీఫ్‌ మేనేజర్‌ నరేంద్రపాండే, మేనేజర్‌ మనోహర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ సాయికుమార్‌, ఎంఈఓలు మహమ్మద్‌ ఇర్షాద్‌, వెంకటరమేష్‌, టీడీపీ మండల కన్వీనర్‌ కురుబ హనుమంతు, నాయకులు సదాశివారెడ్డి, కాదలూరు మోహన రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

రాయదుర్గం: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలపాలిట ఆపన్న హస్తమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఆయన బుధవారం పట్టణంలోని తన నివాసంలో 36 మంది లబ్ధిదారులకుు రూ. 9.91 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలో సీఎంఆర్‌ఎఫ్‌ ద్దారా 335 మందికి రూ. 2.33 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. వేలాది కు టుంబాలకు సాయం చేస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు

Updated Date - Apr 08 , 2026 | 11:58 PM