Share News

TDP: అమరావతికి ఆమోదంపై సంబరాలు

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:14 AM

రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంట్‌ ఉభయసభ లలో బిల్లు ఆమోదం పొందడంతో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వినాయక సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేల్చి కేక్‌ కట్‌ చేశారు.

TDP: అమరావతికి ఆమోదంపై సంబరాలు
TDP ranks exploding firecrackers in Rayadurgam Vinayaka Circle

- హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాలవ, టీడీపీ నాయకులు

(ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్‌)

రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంట్‌ ఉభయసభ లలో బిల్లు ఆమోదం పొందడంతో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వినాయక సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేల్చి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ మాట్లాడుతూ అమరావతిని శాశ్వత రాజ ధానిగా పార్లమెంట్‌లో తీర్మానం చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉభయసభల్లో రాజధాని బిల్లును సమర్ధించలేని వైసీపీ రాష్ట్రంలో రాజకీయం చేసే హక్కు కోల్పోయిందని అన్నారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయం లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిప ల్‌ కమిషనర్‌ దివాకర్‌రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండి క్రిష్ణమూర్తి, కన్వీనర్లు కురుబ హనుమంతు, కాలవ సన్నన్న, బిజేపీ నాయకురాలు జింకా వసుంధర, టంకశాల హనుమంతు, పైతోట అంజి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండలకేంద్రాలు, పలు గ్రామాల్లో టీడీపీ స్థానిక నాయకులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి, మిఠాయిలు పంచారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 03 , 2026 | 12:14 AM