POLES: ఒరిగిన విద్యుత స్తంభాలు
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:08 AM
మండలంలోని ఎల్బీనగర్ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో విద్యుత శాఖ నిర్లక్ష్యం బహిర్గత మవుతోంది. 11 కేవీ విద్యుత లైనకు చెందిన స్తంభాలు అధ్వాన స్థితికి చేరుకుని, రైతుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. ఒక స్తంభం పూ ర్తిగా వంగిపోగా మరొకటి అడుగుభాగం పగిలి లోపలి ఇనుప కడ్డీలు బయటకు కనిపిస్తున్నాయి.
బొమ్మనహాళ్, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎల్బీనగర్ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో విద్యుత శాఖ నిర్లక్ష్యం బహిర్గత మవుతోంది. 11 కేవీ విద్యుత లైనకు చెందిన స్తంభాలు అధ్వాన స్థితికి చేరుకుని, రైతుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. ఒక స్తంభం పూ ర్తిగా వంగిపోగా మరొకటి అడుగుభాగం పగిలి లోపలి ఇనుప కడ్డీలు బయటకు కనిపిస్తున్నాయి. పొలాల్లో రోజూ వ్యవసాయ పనులు చేస్తు న్న రైతులు, కూలీలు ఈ స్తంభాల కిందనే సంచరించాల్సి వస్తోంది. ఎప్పుడైనా గాలి, వర్షం కారణంగా స్తంభం కూలిపోతే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు లైనమ్యానకు, విద్యుత అదికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేకపోవడం రైతులను మరింత కలవరపెడుతోంది. ప్రమాదం జరిగిన తర్వాతే చర్యలు తీసుకుంటారా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సమీపంలోని గోడసలపల్లి రోడ్డులో విద్యుత తీగలు తగలి పలవురి ప్రా ణాలు పోయిన సంఘటన ఉందని రైతులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా విద్యుత శాఖ అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉ న్న స్తంభాలను వెంటనే మా ర్చాలని, మరమ్మతులు చేప ట్టాలని డిమాండ్ చేస్తున్నా రు. లేదంటే ఎలాంటి అపశ్రు తి జరిగినా బాధ్యత అధికారు లదేనని హెచ్చరిస్తున్నారు.