Share News

OFFICE: తెరుచుకోని కార్యాలయం

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:12 AM

మండల కేంద్రమైన డీ.హీరేహాళ్‌లో వ్యవసాయ శాఖ కార్యాలయం ఉందా? లేక ఎప్పుడూ మూసే ఉంటుందా అన్న సందేహాలు ప్రజల నుంచి వ్యక్తమ వుతున్నాయి. కార్యాలయం తరచూ మూతపడి ఉండడం, అధికారులు అందుబాటులో లేకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

OFFICE: తెరుచుకోని కార్యాలయం
Unopened office

- అందుబాటులో ఉండని వ్యవసాయాధికారులు

- ఇబ్బందులు పడుతున్న రైతులు

డీ.హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌), ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన డీ.హీరేహాళ్‌లో వ్యవసాయ శాఖ కార్యాలయం ఉందా? లేక ఎప్పుడూ మూసే ఉంటుందా అన్న సందేహాలు ప్రజల నుంచి వ్యక్తమ వుతున్నాయి. కార్యాలయం తరచూ మూతపడి ఉండడం, అధికారులు అందుబాటులో లేకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మండలంలో రైతులు పత్తిపంటను సాగు చేశా రు. వేసవిలో పంటలకు వచ్చే తెగుళ్లు, రోగాలు, వాటి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి పలువురు రైతలు ఈ కార్యాలయానికి వస్తుంటారు. అయితే ఎప్పుడూ కార్యలయం మూతబడి ఉంటోందని రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులను కలువలేక నిరాశతో వెనుదిరుగుతున్నారు.


ఎప్పుడూ వచ్చినా కార్యాలయం తలుపు లు మూసే ఉంటాయని ఎవరికి చెప్పుకోవాలని రైతులు వాపోతున్నారు. వేసవిలో పంటలకు వచ్చే నష్టాల కీలక సమయంలోనే కార్యాలయం పనితీరు సరిగ్గా లేకపోవడం రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. కనీసం సోమవారం కూడా అధికారులు అందుబాటులో ఉండడం లేదని రైతులు ఆవేదరన వ్యక్తం చేస్తున్నారు.

విచారించి చర్యలు తీసుకుంటాం

- పద్మజ, వ్యవసాయ శాఖ ఏడీ, రాయదుర్గం

డీ.హీరేహాళ్‌ మండల వ్యవసాయాధికారి అందుబాటలో ఉండడం లేదనే విషయం నా దృష్టికి రాలేదు. అయితే విచారించి చర్యలు తీసు కుంటాం. ప్రస్తుతం మండల వ్యవసాయాధికారి రెండు రోజులు సెల వులో వెళ్లారు. సోమవారం విధులకు హాజరవుతారు. రైతులకు అందు బాటులో ఉండి పంటల సాగుకు సంబంధించిన సలహాలు, సూచనాలు ఇవ్వాలని ప్రతి సమావేశంలో సూచిస్తున్నాం. రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 05 , 2026 | 12:12 AM