Share News

MEET: రూ. 7 లక్షల నిధులు ఏమయ్యాయి?

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:20 AM

మండల పరిషత ఖాతాలో ఉన్న రూ. 7లక్షల నిధులు ఏమయ్యాయంటూ మండల వైస్‌ ఎంపీపీ లీలావతి ఎంపీడీవో విజయసింహారెడ్డిని ప్రశ్నించారు. మండల పరిషత కార్యాలయంలో శనివారం ఎంపీపీ వండ్రప్ప అధ్యక్షతన ఎంపీడవో విజయసింహారెడ్డి సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

MEET: రూ. 7 లక్షల నిధులు ఏమయ్యాయి?
Vice MP Leelawathi is questioning MPDO

- ఎంపీడీవోను ప్రశ్నించిన వైస్‌ ఎంపీపీ

కణేకల్లు, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): మండల పరిషత ఖాతాలో ఉన్న రూ. 7లక్షల నిధులు ఏమయ్యాయంటూ మండల వైస్‌ ఎంపీపీ లీలావతి ఎంపీడీవో విజయసింహారెడ్డిని ప్రశ్నించారు. మండల పరిషత కార్యాలయంలో శనివారం ఎంపీపీ వండ్రప్ప అధ్యక్షతన ఎంపీడవో విజయసింహారెడ్డి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో వైస్‌ ఎంపీపీ లీలావతి మాట్లాడుతూ... మండలపరిషత కార్యాల యంలో టాయిలెట్ల మరమ్మతులు, పెయింటింగ్‌ కోసం వెచ్చించినట్లు బిల్లులు పెట్టారని, కానీ కనీసం సభ్యులు వెళ్లలేని దుస్థితిలో టా యిలె ట్లు ఉన్నాయన్నారు. నిధులు ఎక్కడికి వెళ్లాయని ఆమె ఎంపీడీవోను నిలదీశారు. దీంతో ఎంపీడీవో మాట్లాడుతూ.. తాము ఖర్చు చేసిన నిధు ల వివరాలను రెండురోజుల్లో మీకు అందిస్తామని చెప్పడంతో వైస్‌ ఎంపీపీ శాంతించారు. హనుమాపురం ఎంపీటీసీ నరేంద్ర మాట్లాడుతూ రెవెన్యూశాఖ పరిధిలోని జాయింట్‌ ఎల్‌పీఎంలతో రైతులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని ఆ సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ తహ సీల్దార్‌ విశ్వనాథ్‌ను కోరారు. అలాగే పలువురు సభ్యులు


మాట్లాడుతూ ప్రతి మండలమీట్‌లో తాము లేవనెత్తిన అంశాలకు సంబంధించి సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇస్తున్నప్పటికీ అవి పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవోఆర్డీ చంద్ర మౌళి మాట్లాడుతూ... సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రతి మూడు పంచాయతీలకు చొప్పున ఒక ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించిందని, ఆయా గ్రామపంచాయతీ సమస్యలు ఏమైనా ఉంటే ఆ అధికారు ల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రత్యేక అధికారుల వివరాలను సభ్యులకు వివరించారు. కాగా పలుశాఖ అధికారులకు సంబంధించి వారి వారి సిబ్బందిని మండల సమావేశానికి పంపడంతో ఎంపీడీఓ విజయసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశాలలో ఇలాంటివి పునరావృతమైతే ఆయా అధికారుల తీరుపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో షేక్షావలి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 05 , 2026 | 12:20 AM