Home » Rajnath Singh
పార్టీ విప్‌లు లేకుండా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఉప రాష్ట్రపతి పదవికి ఓటింగ్ జరుగుతోంది. దీంతో ఎన్డీయే, 'ఇండియా' కూటమి నేతలు క్రాస్ ఓటింగ్ జరగవచ్చని, తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా ఎవరినీ శత్రువుగా భావించదని, ఇదే సమయంలో ప్రజల ప్రయోజనాలకు భంగం కలగనీయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
భవిష్యత్తులో భారత యుద్ధ నౌకలన్నీ స్వదేశంలోనే తయారవుతాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారమయ్యేలా ముందడుగు వేస్తున్నట్టు తెలిపారు.
ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరిని విధుల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ కలలు సాకారమయ్యాయని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రతలో ఈ రెండు యుద్ధ నౌకలు చరిత్ర సృష్టిస్తాయనే నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ సీఎం జగన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని జగన్‌ను రాజ్‌నాథ్ కోరారు.
ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం అధికార, విపక్ష పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నివాసంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా సీనియర్ నేతలు సుధీర్ఘంగా చర్చలు జరిపారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మీద భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ వృద్ధిని ట్రంప్ అంగీకరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో..
మన రక్షణ ఉత్పత్తులు 2024-25లో రికార్డు స్థాయిలో రూ.1,50,590 కోట్లకు పెరిగాయి. ఇది 2023-24లో ఉన్న రూ.1.27 లక్షల కోట్లతో పోలిస్తే 18 శాతం అధికం. 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి చూస్తే, ఏకంగా 90 శాతం వృద్ధి..
రాహుల్ గాంధీ ఇంతకుముందు కూడా పార్లమెంటులో భూకంపం సృష్టిస్తామంటూ మాట్లారని, అవన్నీ అనవసరమైన మాటలేనని రాజ్‌నాథ్ అన్నారు. ఈసీఐ ఎలాంటి సందేహాలకు తావులేని సమగ్రతను కలిగి ఉందని కొనియాడారు.
ఆపరేషన్ సిందూర్ ఉద్దేశం కేవలం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం మాత్రమే కాదని, ఉగ్రవాదాన్ని భారత్ ఎంత మాత్రం సహించదనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై రాజ్యసభలో మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు.