Share News

Telangana Liberation Day: తెలంగాణ విమోచన వేడుకల్లో రక్షణమంత్రి... జెండా ఆవిష్కరణ

ABN , Publish Date - Sep 17 , 2025 | 10:33 AM

Telangana Liberation Day: సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Telangana Liberation Day: తెలంగాణ విమోచన వేడుకల్లో రక్షణమంత్రి... జెండా ఆవిష్కరణ
Telangana Liberation Day

హైదరాబాద్, సెప్టెంబర్ 17: కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Union Minister Rajnath Singh) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సైనిక అమరవీరుల స్తూపానికి రాజ్‌నాథ్‌ నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆపై సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు కేంద్ర మంత్రి నివాళులర్పించారు. ఆ తరువాత కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు రాజ్‌నాథ్. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ పాల్గొన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడ అమరవీరుల స్థూపం వద్ద సీఎం ఘన నివాళులర్పించారు. అంతేకాకుండా ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని ఇప్పటికే ప్రభుత్వం సర్క్యులర్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంచార్జ్ మంత్రులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు.


ఇవి కూడా చదవండి

రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు

నరేంద్రుడి జైత్రయాత్ర

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 17 , 2025 | 10:56 AM