Share News

Rajnath Singh: భారత యుద్ధ నౌకలన్నీ స్వదేశంలోనే తయారవుతాయి: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:29 PM

భవిష్యత్తులో భారత యుద్ధ నౌకలన్నీ స్వదేశంలోనే తయారవుతాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారమయ్యేలా ముందడుగు వేస్తున్నట్టు తెలిపారు.

Rajnath Singh: భారత యుద్ధ నౌకలన్నీ స్వదేశంలోనే తయారవుతాయి: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh Defence Summit

ఇంటర్నెట్ డెస్క్: ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యం సాకారమయ్యేలా భవిష్యత్తులో భారత యుద్ధ నౌకలన్నీ స్వదేశంలో తయారవుతాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఎన్డీటీవీ డిఫెన్స్‌ సమ్మిట్‌లో మంత్రి ప్రసంగిస్తూ ఈ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత రక్షణ రంగ సామర్థ్యాలను ప్రపంచం ప్రత్యక్షంగా చూసిందని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

‘ఆపరేషన్ సిందూర్ కొన్ని రోజుల పాటు సాగిన యుద్ధంలా అనిపించొచ్చు కానీ దాని వెనకాల బహుళ అంచెల వ్యూహం, సుదీర్ఘకాలం పాటు సాగిన సన్నద్ధత ఉన్నాయి. మన దళాలు, ఆయుధ సంపత్తి, అత్యంత కచ్చితత్వంలో శత్రుమూకలను ధ్వంసం చేసిన వైనం.. దీర్ఘకాలిక ప్రణాళిక అవసరాన్ని చాటి చెబుతోంది. దీర్ఘకాలిక లక్ష్యాలు, దార్శనికత, సన్నద్ధత, సమన్వయం లేనిదే ఏ మిషన్‌లోనూ విజయం సాధించలేము’


‘2014లో మన రక్షణ రంగ ఎగుమతుల విలువ రూ.700 కోట్లు. ఇది ప్రస్తుతం రూ.24 వేల కోట్లకు చేరుకుంది. భారత్ ఇక ఎంతమాత్రం రక్షణ రంగంలో కేవలం కొనుగోలుదారు మాత్రమే కాదని ఈ విషయం రుజువు చేస్తోంది. ఇది మన భవిష్యత్తుకు భద్రతను ఇస్తుంది. ప్రపంచ దేశాల్లో మనను ముందు వరుసలో నిలుపుతుంది’ అని మంత్రి అన్నారు.

ఇటీవల భారత నావికాదళంలో ప్రవేశపెట్టిన నీల్గిరి తరగతి ఫ్రిగేట్ నావల్లో 75 శాతం స్వదేశీ పరికరాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ స్థాయిలో స్వదేశీ పరికరాల అభివృద్ధి భారత్‌కు వ్యూహాత్మక స్వేచ్ఛను ఇస్తుందని మంత్రి అన్నారు.


ఇవి కూడా చదవండి:

నీలగిరి జిల్లాలో కుండపోత.. దీవులుగా మారిన పల్లపు ప్రాంతాలు

1991 లోక్‌సభ ఎన్నికల్లో నన్ను మోసపూరితంగా ఓడించారు: సీఎం సిద్దరామయ్య

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 30 , 2025 | 01:36 PM