Share News

Heavy Rains: నీలగిరి జిల్లాలో కుండపోత.. దీవులుగా మారిన పల్లపు ప్రాంతాలు

ABN , Publish Date - Aug 30 , 2025 | 10:39 AM

నీలగిరి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు కురిసిన వర్షానికి గూడలూరు, పందలూరు పరిసర ప్రాంతాల్లో వరద దృశ్యాలు నెలకొన్నాయి. పల్లపు ప్రాంతాలు దీవులుగా మారాయి. గూడలూరులోని ప్రధాన రహదారుల్లో మోకాలిలోతు వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది.

 Heavy Rains: నీలగిరి జిల్లాలో కుండపోత.. దీవులుగా మారిన పల్లపు ప్రాంతాలు

- ఇళ్లలోకి వర్షపు నీరు

చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు కురిసిన వర్షానికి గూడలూరు, పందలూరు పరిసర ప్రాంతాల్లో వరద దృశ్యాలు నెలకొన్నాయి. పల్లపు ప్రాంతాలు దీవులుగా మారాయి. గూడలూరులోని ప్రధాన రహదారుల్లో మోకాలిలోతు వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది. పాడంతురై - అలవాయల్‌ మెయిన్‌రోడ్డు పూర్తిగా నీట మునిగింది. ఆ మార్గంలో వాహనాలు వెళ్లలేని పరిస్థితులు దాపురించాయి. ఈ వర్షాలకు దేవలా ప్రాంతం వద్ద సుందరలింగం అనే వ్యక్తికి చెందిన ఇల్లు కూలింది.


ఆ ఇంటి శిథిలాల మధ్య చిక్కుకుని అతడి భార్య చంద్రిక (50) గాయపడ్డారు. చుట్టుపక్కలి వారి ఆమెను వెలికి తీసి ఊటీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదే విధంగా ముత్తులింగం అనే వ్యక్తికి చెందిన ఇల్లు కూడా కూలింది. ఊటీలోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. అదే సమయంలో పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు అలముకుంది. ప్రభుత్వ అధికారులు వర్షబాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.

nani4.2.jpg


ఐదు రోజులు మోస్తరు వర్షాలు

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి సెప్టెంబరు 3వ తేది వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. దక్షిణ భారత ప్రాంతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. అదే సమయంలో పశ్చిమ కనుమల కొండ ప్రాంతాల్లో భారీ వర్షం, గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. రాజధాని నగరం చెన్నైలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో స్వల్పవర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. ఇక పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 26-27 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇన్‌ఫార్మర్‌ నెపంతో గిరిజనుడి హత్య

గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 30 , 2025 | 10:39 AM