Siddaramaiah Claims Fraud: 1991 లోక్‌సభ ఎన్నికల్లో నన్ను మోసపూరితంగా ఓడించారు
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:24 AM
కొప్పళ లోక్‌సభ స్థానం నుంచి 1991లో తాను జనతా దళ్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తనను మోసపూరితంగా...
బెంగళూరు, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): కొప్పళ లోక్‌సభ స్థానం నుంచి 1991లో తాను జనతా దళ్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తనను మోసపూరితంగా ఓడించారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో తనపై కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజ్ పాటిల్ అన్వరి గెలిచారని, 11,200 కంటే తక్కువ ఓట్ల మెజార్టీతో విజయం సాధించారని తెలిపారు. అయితే కౌంటింగ్‌లో 22,243 ఓట్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారని, అదే తన ఓటమికి కారణమని, ఆ ఓట్లను లెక్కించి ఉంటే తాను గెలిచేవాడినని వివరించారు. మాజీ అడ్వకేట్ జనరల్ ప్రొఫెసర్ రవివర్మ కుమార్ న్యాయవాద వృత్తిని చేపట్టి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా విధానసౌధలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సిద్దరామయ్య నాటి ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో రవివర్మ తనకు సాయం చేశారని గుర్తుచేసుకున్నారు. అయితే, ఓట్ల చౌర్యంపై రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్న తరుణంలోనే సిద్దరామయ్య..అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజ్‌పాటిల్ తనపై మోసపూరితంగా గెలిచారని చెప్పడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ మోసం చేసి గెలిచినట్లు సిద్దరామయ్యే స్వయంగా ప్రకటించారని బీజేపీ విమర్శించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..