Share News

Rajnath Australia Visit: భారత-ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలోపేతం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్

ABN , Publish Date - Oct 09 , 2025 | 07:18 AM

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ రెండు రోజుల అధికారిక పర్యటనలో. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ, వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో..

Rajnath Australia Visit: భారత-ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలోపేతం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్
Rajnath Australia visit

కాన్‌బెరా(ఆస్ట్రేలియా), అక్టోబర్ 9: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఇది రెండు రోజులపాటు సాగే అధికారిక పర్యటన. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ, వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారత రక్షణ మంత్రి ఆస్ట్రేలియా పర్యటన జరుగుతోంది.

నిన్న (బుధవారం) సిడ్నీ పర్యటన పూర్తి చేసుకున్న రాజ్ నాథ్ సింగ్, ఇవాళ కాన్‌బెరా రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకున్నారు. తర్వాత ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో 'వెల్‌కమ్ టు కంట్రీ స్మోక్'వేడుక జరిగింది. ఇది ఆదివాసీ ఆస్ట్రేలియన్ల సంప్రదాయాన్ని గౌరవించే కార్యక్రమం.


ఇవాళ రాజ్‌నాథ్ సింగ్-ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని, ఆ దేశ డిఫెన్స్ మంత్రి అయిన రిచర్డ్ మార్లెస్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. అలాగే, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, ప్రధాని ఆంథోనీ అల్బానీస్‌లతో కూడా రాజ్ నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశాల్లో పాల్గొంటారు.


కీలక ఒప్పందాలపై సంతకాలు: ఈ పర్యటనలో రెండు ముఖ్య ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. మొదటిది, సబ్‌మెరైన్ శోధన, రక్షణ సహకారానికి ఎంఓయూ (MoU), ఇందులో భారత్ నావికాధిపతి వైస్ చీఫ్-ఆస్ట్రేలియా నావికాధిపతి వైస్ అడ్మిరల్ మార్క్ హామండ్ సంతకాలు చేస్తారు.

రెండవది, జాయింట్ స్టాఫ్ టాక్స్ కోసం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. ఇందులో భారత్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్-ఆస్ట్రేలియా వైస్ అడ్మిరల్ జస్టిన్ జోన్స్ పాల్గొంటారు. అలాగే, రక్షణ ఇంటెలిజెన్స్ పంపకం అంశం కూడా రాజ్ నాథ్ పర్యటన చివరి దశలో ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 09 , 2025 | 07:37 AM