Share News

Vice President Election 2025: తొలి ఓటర్లలో రాజ్‌నాథ్, కిరిణ్ రిజిజు

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:24 AM

పార్టీ విప్‌లు లేకుండా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఉప రాష్ట్రపతి పదవికి ఓటింగ్ జరుగుతోంది. దీంతో ఎన్డీయే, 'ఇండియా' కూటమి నేతలు క్రాస్ ఓటింగ్ జరగవచ్చని, తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Vice President Election 2025: తొలి ఓటర్లలో రాజ్‌నాథ్, కిరిణ్ రిజిజు
Rajnath singh Vice president Election

న్యూఢిల్లీ: నూతన ఉపరాష్ట్రపతి (Vice President)ని ఎన్నుకునేందుకు మంగళవారం ఉదయం 10 గంటలకు పార్లమెంటు నూతన భవనంలో 'ఎఫ్-101 వసుధ'లో పోలింగ్ మొదలైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తొలి ఓటు వేశారు. ఓటింగ్ మొదలైన కొద్ది సేపటికే కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) , అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


పార్టీ విప్‌లు లేకుండా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఉప రాష్ట్రపతి పదవికి ఓటింగ్ జరుగుతోంది. దీంతో ఎన్డీయే, 'ఇండియా' కూటమి నేతలు క్రాస్ ఓటింగ్ జరగవచ్చని, తమ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉభయసభలకు చెందిన 781 మంది ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా, మెజారిటీ సాధించడానికి 391 ఓట్లు అవసరమవుతాయి. ఎన్డీయేకు 425 మంది ఎంపీల మద్దతు కనిపిస్తుండగా, విపక్ష ఇండియా కూటమికి 324 ఎంపీల బలం ఉంది.


వీల్‌చైర్‌పై వచ్చిన దేవెగౌడ

కాగా, భారత మాజీ ప్రధాని, రాజ్యసభలో జేడీ (ఎస్) ఎంపీ హెచ్‌డీ దేవెగౌడ (HD Deve Gowda) పార్లమెంటుకు వీల్‌చైర్‌పై వచ్చారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.


ఇవి కూడా చదవండి..

తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ

రామమందిరంలో పూజలు చేసిన రాధాకృష్ణన్, గెలుపుపై ఎవరి ధీమా వారిదే

For More National News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 11:25 AM