Home » Rahul Gandhi
ఓటు చోరీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు మోదీ ప్రభుత్వం జవాబు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పవర్ ఆఫ్ ఓటుకి దెబ్బ తగులుతోందని చెప్పుకొచ్చారు. దేశంలో 80 శాతం మంది ప్రజలు ఓటు చోరీ జరిగిందని నమ్ముతున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
రాహుల్ గాంధీ 2024లో అమెరికాలో పర్యటించినప్పుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు ఇది. భారతదేశంలో సిక్కులు స్వేచ్ఛగా తమ విశ్వాసాలను పాటించలేకున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను ముఖ్యమంత్రి స్టాలిన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంపిక చేస్తారని డీఎంకే ప్రిసీడియం కార్యదర్శి ఆర్ఎస్ భారతి పేర్కొన్నారు.
కాంగ్రెస్ 10 అంశాల కార్యక్రమంలో భాగంగా ఈబీసీల కోసం 'ఈబీసీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్' తీసుకువస్తామని వాగ్దానం చేసింది. ఎస్సీ/ఎస్టీలకు ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న చట్టాల తరహాలోనే ఇది ఉంటుందని తెలిపింది.
బీహార్‌లోని 25 జిల్లాల్లో ఆగస్టు 17 నుంచి 15 రోజుల పాటు ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ ఇప్పటికే కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉంది.
బీజేపీ చేస్తున్న ఓటు చోరీ ఫలితంగానే దేశంలోని యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని రాహుల్ అన్నారు. ప్రజల సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తు్న్న వారికి ఎన్నికల కమిషన్ కొమ్ముకాస్తోందని రాహుల్ పదేపదే విమర్శలు గుప్పిస్తున్నారు. గత గురువారంనాడు కూడా మీడియా సమావేశంలో ఆయన కర్ణాటక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డాటాను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ఓటర్ల ఓట్లను ఒక పద్ధతిప్రకారం తొలగించారని ఆరోపించారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీ బీజేపీ చీఫ్ రామచందర్ రావు సెటైర్లు గుప్పించారు. 50 సార్లు ఢిల్లీ వెళ్లినందుకు రేవంత్‌రెడ్డికి ఆఫ్ సెంచరీ సెలబ్రేట్ చేయాలని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందని రామచందర్ రావు విమర్శించారు.
ట్రంప్ తొలిసారి దేశాధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఈ అంశాన్ని ట్రంప్ దృష్టికి తీసుకురాకపోవడంపై మోదీని తాను 2017లోనే ప్రశ్నించానని రాహుల్ గుర్తుచేశారు. మోదీ ఓ బలహీన ప్రధాని అని రాహుల్ ఎద్దేవా చేశారు.
భారత్‌లోనూ జెన్-జీ ఓట్ల చోరీని అడ్డుకుంటుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారం రేపింది. ఓట్ల దొంగలను...