Ayodhya Visit: అయోధ్యలో పర్యటించనున్న పార్లమెంటరీ కమిటీ.. సభ్యులలో రాహుల్ గాంధీ
ABN , Publish Date - Jan 14 , 2026 | 09:03 PM
పార్లమెంటరీ కమిటీ ఆయా ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు పర్యటనలు జరుపుతుంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డిఫెన్స్ కమిటీ తొలుత షెడ్యూల్ ఇన్‌స్పెక్షన్‌లో భాగంగా వారణాసిలోని ఆర్మీ కంటోన్మెంట్‌లో పర్యటిస్తుంది.
న్యూఢిల్లీ: రక్షణపై పార్లమెంటరీ స్థాయీ సంఘం (Parliamentary Standing Committee on Defence) అధికార పర్యటనలో భాగంగా ఈనెల 23న అయోధ్యలో పర్యటించనుంది. కమిటీ పర్యటనలో వారణాసి కూడా ఉంది. 32 మంది సభ్యుల కమిటీలో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. అయితే అయోధ్య పర్యటనలో ఆయన పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.
పార్లమెంటరీ కమిటీ ఆయా ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు పర్యటనలు జరుపుతుంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డిఫెన్స్ కమిటీ తొలుత షెడ్యూల్ ఇన్‌స్పెక్షన్‌లో భాగంగా వారణాసిలోని ఆర్మీ కంటోన్మెంట్‌లో పర్యటిస్తుంది. అనంతరం సభ్యులు అయోధ్యకు వెళ్తారని, రామాలయాన్ని సందర్శిస్తారని తెలుస్తోంది. ఈనెల 22, 23 తేదీల్లో అయోధ్యలో కమిటీ పర్యటించనుంది.
2024న జనవరి 22న రామాలయ ప్రతిష్టాపన జరిగింది. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖుల సమక్షంలో ఆలయంలో ప్రతిష్టించారు. ఈ ఉత్సవానికి రాహుల్ గాంధీ హాజరుకాకపోడంపై బీజేపీ విమర్శలు సైతం గుప్పించింది. బుజ్జగింపు రాజకీయాలే ఇందుకు కారణమని విమర్శించింది. ఇంతవరకూ ఆయన రామాలయాన్ని సందర్శించ లేదంటూ ఆ పార్టీ నేతలు తరచు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అయోధ్యలో పర్యటించే కమిటీతో కలిసి రాహుల్ అయోధ్య వెళ్తారా అనేది ఇంకా స్పష్టం కాలేదు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. భారతీయులకు ఎంబసీ అలర్ట్
తాజ్‌మహల్‌లో ఉర్సును నిషేధించకుంటే శివతాండవం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి