Home » Puttaparthy
రైతులకు యూరియా సరఫ రా చేయాలని కోడిపల్లి గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం రైతులు ధర్నా చేపట్టారు.
పట్టణంలో ఇటీవల జరిగిన మురుగు కాలువల పూడికతీతలో ఏవిచారణకైనా సిద్ధమని మున్సిపల్ చైర్మన రమేష్ సవాల్ చేశారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం చైర్మన అధ్యక్షతన నిర్వహించారు.
కొన్నేళ్లుగా వ్యవసాయ పొలాల్లో విద్యుత తీగలు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. దీనిపై పలుమార్లు ట్రాన్సకో అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపనపోలేదని తిమ్మాపురం రైతులు వాపోతున్నారు.
పట్టణంలో చవితి సందడి మొదలైంది. వాడవాడలా, వీధివీధిన విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు యువకులు పోటీపడుతున్నారు. చవితి రోజు పూజా సామగ్రి కొనుగోలుకు యువత తరలి వస్తున్నారు. పట్టణంలోని వీధుల్లో వినాయక మండపాల ఏర్పాట్లలో యువత నిమగ్నమయ్యారు.
త్రైత సిద్ధాంత ప్ర బోధ సేవాసమితి, ఇందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల పరిధిలోని తుంపర్తి గ్రామంలో శ్రీకృష్ణుడి ఊరేగింపును ఘ నం గా నిర్వహించారు. ఈ నెల 16న కృష్ణా ష్టమి నుంచి పూజలందుకున్న శ్రీకృష్ణుడి ప్రతిమను గురువారం అలంకరించి గ్రామంలో ఊరేగించారు. స్థానికులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి సేవాసమితి సభ్యులు తరలివచ్చి గ్రామోత్సవంలో భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
క్రీడల్లో ప్రతిభ చాటే విద్యార్థులకు తన వంతు సహాయ స హకారాలు అందిస్తా నని టీడీపీ నియో జకవర్గ ఇనచార్జ్ పరి టాల శ్రీరామ్ పేర్కొ న్నారు. ఒంగోలులో ఈనెల 17న జరిగిన 43వ యానివర్సిరీ ఆలిండి యా ఓపెన కరాటే చాంపియన షిప్‌లో ప్రతిభచాటిన ధర్మవరం విద్యా ర్థులను ఆయన మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అభినందించారు.
గంటల కొద్దీ త్వరగా వెరిఫికే షన పూర్తి చేయాలని దివ్యాంగ పింఛన దారులు సోమవారం స్థానిక ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. వైసీపీ పాలనలో ఇష్టారాజ్యంగా పింఛన్లు పంపిణీ చేశారు. అర్హత లేకపోయినా కొంతమంది దివ్యాంగుల పేరుతో ధృవప్రతాలు సంపాదించి పింఛన్లు పొందుతున్నారు.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేశారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. లచ్చన్న సాహసానికి, కార్య దీక్షతకు మెచ్చి ప్రజలే సర్దార్ అనే బిరుదును ఆయనకిచ్చారని గుర్తు చేశారు.
మండలకేంద్రానికి సమీపంలో రాచువారిపల్లికి వెళ్లే రహదారిలో రోడ్డుకు ఆ రువైపుల ప్రభుత్వం వివిధ హాస్టల్ భవనాలను నిర్మించింది. బీసీ బాలికల, ఎస్సీ బాలిక, బాలుర, ఎస్టీ బాలుర హాస్టళ్లను రూ. కోట్లు ఖర్చు చేసి గతంలో నిర్మించారు. వాటికి ప్రహరీ నిర్మించి, గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు.
వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన జిల్లాలో వినాయక మండపాల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విద్యుత, పంచాయతీ, మున్సిపల్ శాఖాధికారులతో సమీక్షించారు.