MUNICIPAL CHAIRMAN: అన్ని వీధులు.. ఇక సీసీ రోడ్లే
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:08 AM
పట్టణంలోని అన్నివీధులు ఇక సీసీరోడ్లుగా మార్చుతామని మున్సిపల్ చైర్మన రమేష్ అన్నారు. సోమవారం పట్టణంలోని మూడో వార్డులో రూ.92.5కోట్ల నిధులతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.
హిందూపురం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని అన్నివీధులు ఇక సీసీరోడ్లుగా మార్చుతామని మున్సిపల్ చైర్మన రమేష్ అన్నారు. సోమవారం పట్టణంలోని మూడో వార్డులో రూ.92.5కోట్ల నిధులతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. చైర్మన, టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతాల్లో సైతం సీసీరోడ్లు నిర్మిస్తామన్నారు. మరిన్ని నిధులు పట్టణ అభివృద్ధికి వస్తాయన్నారు. కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున, ఎమ్మెల్యే పీఏ వీరయ్య, నాయకులు అనిల్, చంద్రమోహన, అశోక్, అన్వర్ పాల్గొన్నారు.