MIRCHI : రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:03 AM
ఎండుమిర్చి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూడాలని యార్డ్ అధికారులకు వ్యవసాయ మార్కెట్‌యార్డ్ చైర్మన అశ్వత్థనారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో ఎండుమిర్చీ క్రయ విక్రయాలను పరిశీలించారు.
హిందూపురం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఎండుమిర్చి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూడాలని యార్డ్ అధికారులకు వ్యవసాయ మార్కెట్‌యార్డ్ చైర్మన అశ్వత్థనారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో ఎండుమిర్చీ క్రయ విక్రయాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి మార్కెట్‌కు పంటను తీసుకొస్తారన్నారు. అలాంటిది గిట్టుబాటు ఉండేలా వ్యాపారులు సహకరించాలన్నారు. అంతేకాక సంచులు, తూకాలు, కమీషనలో కూడా నిబంధనలు ప్రకారమే నడుచుకోవాలన్నారు. ఈ ఏడాది వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌కు మిర్చి దిగుబడి తగ్గడానికిగల కారణాలను రైతులతో అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌యార్డ్ కార్యదర్శి నర్సింహమూర్తి, సూపర్‌వైజర్లు ఫణిగోపాల్, కేదార్‌నాథ్, సిబ్బంది పాల్గొన్నారు.