MLA SINDHURA : పేదలకు అండగా సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:29 PM
పేదలకు అండగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
పుట్టపర్తి రూరల్, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): పేదలకు అండగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఎమ్యెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిస్కార మే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని సూచించారు. సమస్యలపై వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నా రు. అనంతరం నియోజవర్గంలోని 33 మందికి రూ. 28,24,776 సీఎం సహాయనిధి చెక్కులను అందచేశారు. నియోజకవర్గంలో కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి రూ.2.22 కోట్లు సీఎం సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు అందించామన్నారు. ఆర్డీఓ సువర్ణ, మునిసిపల్ కమిషనర్ క్రాంతికుమార్ , వెంగళమ్మచెరువు పీఏసీఎస్ అధ్యక్షుడు శ్రీరామిరెడ్డి పాల్గొన్నారు.
సీనియర్ పాత్రికేయుడికి ఆర్థికసాయం: పాత్రికేయ వృత్తిలో 30 ఏళ్లుగా ఉంటూ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పాత్రికేయుడు బసప్పకు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆర్థికసాయం అందచేశారు. శుక్రవారం ఎమ్మెల్యే, మాజీమంత్రి ఏపీయూడబ్ల్యూజే నాయకులతో కలసి పాత్రికేయుడి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. యూనియన సహాయనిధి నుంచి రూ.20వేల చెక్కును, రూ.5 వేలు నగదును ఎమ్మెల్యే, మాజీమంత్రి అందజేశారు. యూనియన అధ్యక్షుడు పుల్లయ్య, కార్యదర్శి బాబు, మహేశ పాల్గొన్నారు.
శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దు: నియోజకవర్గంలో శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే, మాజీమంత్రిని కలిసిన డీఎస్పీ విజయ్‌కుమార్, సీఐలు ఎస్సైలకు నియోజకవర్గంలో శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దని సూచించారు. నల్లమాడ సీఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు ఎమ్మెల్యేకు మొక్కను అందచేశారు. రూరల్ సీఐ సురేష్, అమడగూరు ఎస్సై గోపాల్, పుట్టపర్తి రూరల్ ఎస్సై క్రాంతి, అమడగూరు రూరల్ ఎస్సై గోపీకృష్ణ పాల్గొన్నారు.
టీడీపీ బలోపేతానికి పనిచేయండి: నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆ పార్టీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. శుక్రవారం జిల్లాకమిటీలో ఎంపికైన సభ్యులు ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో ఎమ్మెల్యే, మాజీమంత్రిని కలసి గజమాలతో సత్కరించారు. తమకు అవకాశం కల్పించినందుకు జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీరామిరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి యశోద, సోమశేఖర్, సోషల్‌మీడియా కోఆర్డినేటర్ మణికుమారి, అబ్బా్‌సఖాన, కార్యాలయ కార్యదర్శి రమేష్, కృతజ్ఞతలు తెలిపారు.