HYGIENE: పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక కార్యాచరణ
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:59 PM
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మేజర్ పంచాయతీ అధికారులు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని అన్నిరకాల దుకాణాలు, హోటళ్ల వద్ద ప్రత్యేక ప్లా స్టిక్ టబ్బులను ఏర్పాటు చేస్తోంది.
వాటిలో వేయనివారికి జరిమానా
మేజర్ పంచాయతీ అధికారుల నిర్ణయం
గోరంట్ల, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మేజర్ పంచాయతీ అధికారులు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని అన్నిరకాల దుకాణాలు, హోటళ్ల వద్ద ప్రత్యేక ప్లా స్టిక్ టబ్బులను ఏర్పాటు చేస్తోంది. వ్యర్థాలు, మలినాలు, చెత్తను అందులో వేస్తే పంచాయతీ వాహనం ప్రతిరోజు వచ్చి సేకరించేలా ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ కవర్ల వాడకం నిషేధించారు. నిబంధనలు ఉల్లగించిన వ్యాపారులనుంచి జరిమానా వసూలు చేస్తున్నారు. డీపీఓ సమత, ఎంపీడీఓ కమలాబాయి ఆదేశాల మేరకు జరిమానా కింద వసూలైన మొత్తం రూ.56,200లను ప్లాస్టిక్ ప్లాస్టిక్ టబ్బులను కొనుగోలు చేశారు. వాటికి స్వర్ణాంధ్ర, స్వచ్చంధ్రా స్టిక్కర్లు వేసి వ్యాపారులకు అందచేశారు. వినియోగంలోకి వచ్చాక టబ్బులో చెత్త వేయకుండా నిర్లక్ష్యం వహించిన వారితో జరిమానా వసూలు చేస్తామని కార్యదర్శి తెలిపారు. గోరంట్లలో పలు కూడళ్లలో, రహదారులపై చెత్తకుప్పలు వేస్తూ ఆప్రాం తం ఆపరిశుభ్రంగా మారి, దుర్గంధం వెదజల్లుతోంది. అలాంటి ప్రాంతాలను గుర్తించి పెద్దసైజు తొట్టెలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేకంగా స్వచ్ఛ వాహనాన్ని ఏర్పాటు చేసి, నివాస గృహాలనుంచి తడి, పొడిచెత్తను వేరుగా పారిశుధ్య కార్మికులు తీసుకెళతారన్నారు. ఇప్పటికే టీడీపీ నాయకులు సర్పంచ సరోజనాగేనాయక్ ద్వారా ప్రజల విరాళాలతో వైకుంఠరథం, శవపేటక ఫ్రీజర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. పంచాయతీ అధికారులు స్వచ్ఛత కోసం చేస్తున్న కృషికి స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.