UTF: ఇష్టపడి చదివితేనే బంగారు భవిష్యత్తు
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:12 AM
ప్రతి విద్యార్థి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ కష్టపడికాక ఇష్టపడి చదివితేనే బంగారు భవిషత్తు ఉంటుందని యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు భూతన్న అన్నారు.
మడకశిర టౌన, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రతి విద్యార్థి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ కష్టపడికాక ఇష్టపడి చదివితేనే బంగారు భవిషత్తు ఉంటుందని యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు భూతన్న అన్నారు. పట్టణ సమీపంలోని ఆదిరెడ్డిపాళ్యంలో ఉన్న కేజీబీవీలో పదో తరగతి 2026 మోడల్ పేపర్లను అందజేశారు. ప్రిన్సిపాల్ వరలక్ష్మితో కలిసి ఉపాధ్యాయ సంఘం నాయకులు మోడల్ పేపర్లు విద్యార్థులకు ఇచ్చారు. సీ, డీ గ్రేడ్ విద్యార్థుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిష్ణాతులైన ఉపాధ్యాయులతో మోడల్ పేపర్లను తయారు చేయించామన్నారు. నాయకులు నరసింహప్ప, జోగన్న, మహాలింగప్ప పాల్గొన్నారు.