SP: పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:37 AM
ఎస్పీ సతీష్‌కుమార్ మంగళవారం మండలకేంద్రం లోని పోలీస్ స్టేషనతో పాటు సర్కిల్ కా ర్యా లయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్‌స్టేషన భవనాన్ని పరిశీ లించారు. పైకప్పు పెచ్చులూడి కడ్డీలు దర్శన మిస్తుండడంతో సమస్య ఏమిటని సీఐ నరేం ద్రరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
నల్లమాడ/ ఓబుళదేవర చెరువు/ అమడ గూరు, డిసెంబరు16 (ఆంధ్రజ్యోతి): ఎస్పీ సతీష్‌కుమార్ మంగళవారం మండలకేంద్రం లోని పోలీస్ స్టేషనతో పాటు సర్కిల్ కా ర్యా లయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్‌స్టేషన భవనాన్ని పరిశీ లించారు. పైకప్పు పెచ్చులూడి కడ్డీలు దర్శన మిస్తుండడంతో సమస్య ఏమిటని సీఐ నరేం ద్రరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. వర్షాలు వస్తే పోలీస్‌స్టేషన కారుతుందని, రికార్డులు కూడా తడిసిపోయే పరిస్థి తులు ఉన్నాయని ఎస్పీకి సీఐ వివరించారు. అలాగే ఎస్పీ సర్కి ల్ కార్యాలయాన్ని పరిశీలించి, ఇంత చిన్న గదిలో కార్యాలయం ఎలా నడుపు తున్నారని ప్రశ్నించారు. భవన నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకు న్నారు. గతంలో పోలీస్ అఽధికా రులు సర్కిల్ కార్యాలయం ని ర్మించాలని నల్లమాడ క్రాస్‌లో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్ భవనాన్ని తొలగించి, పు నాదులు నిర్మించారని తెలి పా రు.
వెంటనే ఎస్పీ ఆ ప్రాం తా నికెళ్లి స్థలాన్ని పరిశీలించారు. ఇంకా ఎక్కడైనా ప్రభుత్వ భూ మి ఉందా అని సీఐని ప్రశ్నిం చగా, రెవిన్యూ వారిని అడిగి తెలుసుకుంటామని తెలిపారు. అలాగే ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు ట్రైనీ ఎస్‌ఐ చెన్నయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా ఎస్పీ ఓ బుళదేవరచెరువులోని స్థానిక పోలీస్ స్టేషన ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన పరిసర ప్రాంతాలతో పాటు పోలీస్ స్టేషన బిల్డింగ్ స్థితిగతులను, రిసె ప్షన కౌంటర్‌ను పరిశీలించారు. సిబ్బంది పని తీరుపై ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డిని అడిగి తె లుసుకున్నారు. అనంతరం అమడగూరు పోలీస్ స్టేషనను తనిఖీ చేశారు. ఎస్‌ఐ సు మతితో మాట్లాడుతూ స్టేషనలో సిబ్బంది కొ రత, ఉన్న సిబ్బంది గురించి అడిగి తె లుసుకున్నారు. మండలంలోని సమస్యలపై ఆరా తీశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....