Home » Puttaparthy
అనంతపురంలో బుధవారం నిర్వహించే సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం సోమవారం మండల కన్వీనర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ పథకాలు తదితర అభివృద్ధి పనులను ప్రజలకు విరవించడమే ఽఽఽధేయ్యంగా పనిచేయాలని మంత్రి సవిత సూచించారు. గోరంట్లలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు.
మండల కేంద్రంలో 11రోజులపాటు జరిగిన పూజల అనంతరం వినాయక విగ్రహాల నిమజ్జనం కోలాహలంగా సాగింది. శనివారం మధ్యాహ్నం నుంచి 15వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం ట్రాక్టర్ల ద్వారా తరలించారు.
పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహనరెడ్డి మేం అధికారంలోకి వచ్చాక సప్తసముద్రాల అవతలున్నా టీడీపీ నాయకులను, అధికారులను లాక్కొస్తానని పగటికలలు కంటున్నారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు మండిపడ్డారు.
నాన్న ఆశీర్వాదాలే శ్రీరామరక్ష అని బీసీ సంక్షేమ చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. మండలంలోని రాంపురం పంచాయతీలో మాజీ మంత్రి ఎస్.రామచంద్రారెడ్డి 82వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
పెనుకొండ న గర పంచాయతీ నుంచి కోనాపురం వెళ్లే దారి కోసం రూ.2కోట్లు విలువ చేసే భూమిని కోగిర జయచంద్ర వితరణ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను సకాలంలో వేతనాలు అందకపోవడంతో పనులు మానేస్తున్నారు. దీంతో గామాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. చాలా గ్రామాల్లో ప్రజలు జ్వరాలబారిన పడుతున్నారు.
వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గణేష్ విగ్రహాలు గురువారం మధ్యాహ్నం నుంచి గుడ్డం కోనేరు వద్ద నిమజ్జనానికి క్యూకట్టాయి. భక్తులు రంగులు చల్లుకుంటూ కులమతాలకు అతీతంగా నృత్యాలు చేస్తూ లంబోధరుడి ఊరేగింపులో ముందుకు సాగారు.
వైసీపీ ప్రభుత్వంలో నగర పంచాయతీ పరిధిలో రూ.లక్షలోపు జరిగిన పనులకు సంబంధించి విజిలెన్స ఎంక్వైరీ చేయిస్తామని ఎమ్మెల్యే ఎంఎ్‌స రాజు అన్నారు. శనివారం నగరపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గ్రామాల్లో పారిశుధ్యం లోపించడంతో ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు. రెండువారాలపాటు ఎడితెరిపి లేకుండా వర్షాలు కురవడంతో గ్రామాల్లో వీధులు, రహదారులు చిత్తడిగా మారాయి.