POLICE: జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:00 AM
నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించి, ప్రజల మన్ననలు పొందా లని పోలీసు సిబ్బందికి ఎస్పీ సతీష్‌కుమార్ పిలుపినిచ్చారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేక్‌కట్ చేసి పోలీసుఅదికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియచేశారు.
పుట్టపర్తి రూరల్, జనవరి 1(ఆంధ్రజ్యోతి) : నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించి, ప్రజల మన్ననలు పొందా లని పోలీసు సిబ్బందికి ఎస్పీ సతీష్‌కుమార్ పిలుపినిచ్చారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేక్‌కట్ చేసి పోలీసుఅదికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరూ మంచి ఆరోగ్యంతో ఆనందంగా ఉం డాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు మరింత సమర్థవంతమైన, ప్రజానుకూల సేవలందించే విదంగా పోలీసుశాఖ కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలన్నారు. అనంతరం పెనుకొండ డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ పదవీవిరమణ పొందిన ఆర్‌పీ ఎస్‌ఐ శివశంకర్ ను ఎస్పీ పూలమాల వేసి, పట్టుశాలువాతో ఘనంగా సన్మానించి మె మెంటో అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయ్‌కుమార్, ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు వలి, మహేశ, సీఐలు నరేందర్‌రెడ్డి, శ్రీనివాసులు, ఏఆర్ ఎస్సైలు ఎస్బీ సిబ్బంది, ఇతర పోలీసు అదికారులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....