TIME: ఉత్సాహంగా నూతన సంవత్సరాది
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:56 PM
నూతన సంవత్సర వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
నూతన సంవత్సర వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్‌ను కలసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుబాకాంక్ష లు తెలియజేశారు. ధర్మవరం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయాని కి అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధు సూదనరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ కార్యాలయంలో బీజేపీ నియో జకవర్గ ఇనచార్జ్ హరీశబాబు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వ్యక్తిగత కార్యాలయం వద్ద ఆయన అభిమానులు కేక్‌కట్ చేసి వేడుకలను చేసుకున్నారు. అలాగే ధర్మవరం రూరల్, బత్తలపల్లి, కొత్తచెరువు తదితర మండలాల వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....