DSLA : చట్టాలపై అవగాహన లేకనే కష్టాలు
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:37 PM
ట్టాలపై కనీస అవగాహన లేకనే ప్రజలు కష్టాలపాలు అవుతున్నారని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎస్ రాజశేఖర్ అన్నారు. శుక్రవారం కదిరి సబ్‌జైలును ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట సబ్ జైల్ అధికారి ఉమామహేశ్వరనాయుడు, న్యాయవాద సభ్యులు లోకేశ్వర్ రెడ్డి, దశరథనాయక్, కేవై సిరాజుద్దీన పాల్గొన్నారు.
కదిరి లీగల్, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): చట్టాలపై కనీస అవగాహన లేకనే ప్రజలు కష్టాలపాలు అవుతున్నారని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎస్ రాజశేఖర్ అన్నారు. శుక్రవారం కదిరి సబ్‌జైలును ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట సబ్ జైల్ అధికారి ఉమామహేశ్వరనాయుడు, న్యాయవాద సభ్యులు లోకేశ్వర్ రెడ్డి, దశరథనాయక్, కేవై సిరాజుద్దీన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడా రు. చట్టంలో ఇరుక్కుని జైలుపాలైన తరువాత పరిస్థితిని ఆలోచించుకోవాలని సూచించారు. ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంచేందకుఉ ప్రజా న్యాయస్థానాల ద్వారా న్యాయ విజ్ఞాన సదస్సులను కొనసాగిస్తున్నామన్నారు. ఇంటి వద్ద కుటుంబ సభ్యులకు ఎదురయ్యే అవమానాలను అవగాహన చేసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం ఖైదీలకు ఇస్తున్న ఆహార, వైద్య, చలిదుప్పట్లను, సౌకర్యాలను పరిశీలించారు.