PASS BOOK: పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:51 PM
మండలంలోని మర్తాడు గ్రామంలో రైతులకు పట్టా దారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా జాయిం ట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీవో మ హేష్ హాజరై వాటిని రైతులకు అందజేశారు.
ముదిగుబ్బ, జనవరి 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని మర్తాడు గ్రామంలో రైతులకు పట్టా దారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా జాయిం ట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీవో మ హేష్ హాజరై వాటిని రైతులకు అందజేశారు. ఎంపీ పీ ఆదినారాయణ యాదవ్, టీడీపీ క్లస్టర్ ఇనచార్జ్ తుమ్మల మనోహర్, రెవెన్యూ సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు. అనం తరం జేసీ స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.
ధర్మవరం రూరల్: మండలంలోని తుమ్మల గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ రీసర్వే ప్రాజెక్టు భూపట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్య క్రమాన్ని రెవెన్యూ అధికారులు నిర్వహించారు. తహసీల్దార్ సురేష్ బాబు, సింగల్‌విండో చైర్మన మేకల రామాంజినేయులు హాజరై రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.
గాండ్లపెంట: మండల పరిఽధిలోని కమతం పల్లి పంచాయతీలో శుక్రవారం రైతులకు రాజముద్ర ముద్రించిన పట్టాదార్ పాస్‌పుస్తకాలను తహసీల్దార్ బాబారావు పంపిణీ చేశారు. కమతంపల్లి పరిఽఽధిలోని రైతు లకు 165 పుస్తకాలను అందజేశారు.
అలాగే మద్దివారిగొంది పంచాయ తీలో 232 మందికి త్వరలో పంపిణీ చేస్తామని తెలిపారు.
నల్లమాడ/ అమడగూరు: మన ఆస్తి మన హక్కు అని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. మండలపరిధిలోని చౌటకుంటపల్లి రెవెన్యూ గ్రామంలో శుక్రవారం రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీచేశారు. 186మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించినట్లు తెలి పారు. వాటిలో తప్పులుంటే తహసీల్దార్ కార్యాలయం వెళ్లి సరిదిద్దుకోవ డానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. అదే విధంగా అమడగూరు మండలంలోని చీకిరేవులపల్లిలో రైతులకు పట్టాదా రు పుస్తకాలను ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా తహసీల్దార్లు, ఇతర అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....