Home » Puttaparthy
మద్యం ఫుల్‌గా తాగిన ఓ మందుబాబు జిల్లా కేంద్రంలోని ప్రశాంతిగ్రామ్‌లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం ప్రశాంతిగ్రామ్‌లో ఓ యువకుడు మద్యం పుల్‌గా సేవించి కదులుతున్న కారుటా్‌పపై పడుకుని రోడ్డుకు ఇరువైపుల ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు.
మహిళ కుటుంబానికి వెన్నె ముక లాంటిదని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. మహిళలు ఆరో గ్యం గా ఉంటేనే ఆ కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటుందన్నారు. మం డల కేంద్రంలోని సీహెచసీలో స్వస్థ్ నారీ సశక్తి పరివార్ అభియాన కార్య క్రమాన్ని బుధవారం డీఎంహెచఓ ఫైరోజ్‌బేగం, డీసీహెచఎస్ మధుసూ దన ఆధ్వర్యంలో డాక్టర్ అశ్వత్థకుమార్ నిర్వ హించారు.
మండల పరిధిలోని తిరుమలదేవరపల్లిలో తాగునీటి పైపులైన పగిలిపోయి నీరు వృథా గా రోడ్డుపై పారుతోంది. దాదాపు 20 రోజుల క్రితం ఈ పైపులైన పగిలిపోయిందని గ్రామస్థులు తెలిపారు. దీంతో నీరు ట్యాంకుకు వెళ్లడంలేదని, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాని వాపో యారు. నీరంతా రోడ్డుపై నిలబడుతూ మడుగును తలపిస్తోందని అంటున్నారు.
గ్రంథాలయ సమస్యలను ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సోమవారం ప్రస్తావించారు. ఆధునిక దేవాలయాలైన గ్రంథాలయాలను డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని వక్కలిగ రాష్ట్ర కార్పొరేషన చైర్మన లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం మడకశిర వైద్య విధాన పరిషత ఆసుపత్రిలో స్వస్థ్ నారీసశక్త్ పరివార్ అభియాస్ అనే కార్యక్రమం నిర్వహించారు.
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, మున్సిపల్ చైర్మన రమేష్ అన్నారు. టీడీపీ నాయకుడు మగ్బూల్ ఆధ్వర్యంలో ఎంజీఎం క్రీడా మైదానంలో నాలుగు రోజులుగా అబ్దుల్‌కాలం క్రికెట్ టోర్నీ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన విఽధానాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని దస్తావేజు లేఖరులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయం ఎదుట శుక్రవారం దస్తావేజులేఖరులు నిరసన వ్యక్తం చేశారు.
డ్వాక్రా సంఘాల సృష్టికర్త సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు.ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో డ్వాక్రా సంఘాలను సీఎం ప్రవేశపెట్టారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 270మంది యానిమేటర్లకు బయోమెట్రిక్ డివై్‌సలను పంపిణీ చేశారు.
స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి రెగ్యులర్ తహసీల్దార్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా కార్యాలయంలో ఇనచార్జి అధికారులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో ప్రజలు విసిగిపోతున్నారు. పెనుకొండ్ డివిజనలో చిలమత్తూరు మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉంటున్నాయి.
మండలంలో 30చెరువుల మరమ్మతుకు రూ.20కోట్లతో ప్రణాళికలు రూపొందించామని ఇరిగేషన ఏఈ వినోద్‌కుమార్ తెలిపారు. సోమవారం మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నాగమ్మ అధ్యక్షతన నిర్వహించారు.