STUDENTS: సకాలంలో లేని బస్సు వసతి
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:24 PM
మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సకాలం లో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతు న్నారు. ఓబుళదేవరచెరువు, అమడగూరు మండలాలకు కలిపి అమ డగూరు మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారు.
- కళాశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
- ప్రైవేటు వాహనాలు, ఆటోలే గతి
అమడగూరు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సకాలం లో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతు న్నారు. ఓబుళదేవరచెరువు, అమడగూరు మండలాలకు కలిపి అమ డగూరు మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారు. అమడగూరుకు సమీపంలోని ఈ రెండు మండలాలకు చెందిన మహమ్మదాబాద్, జౌకల, కొట్టువారిపల్లి, గుండువారి పల్లి తదితర గ్రామాల నుంచి నుంచి విద్యార్థిని, విద్యార్థులు రోజూ కళాశాలకు వెళ తారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం అమ లుచేసింది కానీ, ఆర్టీసీ బస్సులు కళాశాల సమయానికి రాకపోవడంతో విద్యార్థినులు ప్రైవేటు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలను ఆశ్రయిం చి డబ్బులు చెల్లించి ప్రయాణించాల్సి వస్తోంది. అలాగే మండలకేంద్రం లో ఉన్న మోడల్‌స్కూల్, జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలకు ఓబుళదేవర చెరువు, అమడగూరు మండలాలకు చెందిన చు ట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులు వెళ్లి చదువుకుంటున్నారు.
అ యితే సకాలంలో బస్సు వసతి లేకపోవడంతో వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పాఠశాలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోంది. అలాగే ఇంటికి వచ్చేటప్పుడు ఆలస్యం అవుతోంది. దీంతో సమయం వృథా అవుతోందని, చదువుకు ఆటంకం అవుతోందని విద్యార్థులు, తల్లిదండ్రు లు వాపోతు న్నారు. సకాలంలో బస్సు సౌకర్యం ఉంటే ఆ ఇబ్బంది ఉండదని అంటున్నారు. అలాగే విద్యార్థులందరూ ఒకే సారి హాజరైతే బోధనకు ఇబ్బంది ఉండదని ఉపాధ్యాయులు తెలుపుతున్నారు. మండ లంలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి కానీ సకాలంలో లేవంటున్నారు. అదే ఉదయం 8 గంటలకు ఓబుళ దేవరచెరువులో బస్సు బయలు దేరితే మహమ్మదాబాద్, జౌకల, కొట్టువారిపల్లి, గుండువారిపల్లి గ్రామాల మీదుగా అమడగూరుకు ఉదయం 9:10కి చేరుకుంటుంది. ఈ విధంగా అధికారులు బస్సును ఏర్పాటుచేస్తే విద్యార్థిని, విద్యార్థులు పాఠశాలలకు సమయానికి చేరుకుంటారని, ఈ సౌకర్యాన్ని కల్పించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు.
రూటు పరిశీలన చేసి ఏర్పాటు చేస్తాం - మైనుద్దీన, ఆర్టీసీ డిపో మేనేజర్, కదిరి
ప్రస్తుతం విద్యార్థుల కోసం ప్రత్యేక సర్వీసు నడుపుతున్నాం. కానీ మహమ్మదాబాద్, అమడగూరు, చినగానిపల్లి మీదుగా నడుస్తోంది. మహమ్మదాబాద్, జౌకల, కొట్టువారిపల్లి మీదుగా నడవలేదు. రూటు పరిశీలన చేసి విద్యార్థుల సౌకర్యం కోసం బస్సు ఏర్పాటు చేస్తాం. విద్యార్థుల సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి సర్వీను నడుపుతాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....