Share News

COLLECTOR: సేవల్లో పారదర్శకత తప్పని సరి: కలెక్టర్‌

ABN , Publish Date - Jan 08 , 2026 | 11:47 PM

ప్రజలకందిస్తున్న సేవల్లో పారదర్శకత, సమయ పాలన తప్పకుండా ఉండాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ రిజిసే్ట్రషన అధికారులకు సూచించారు. ఆయన గురువారం మండలకేంద్రంలోని సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

COLLECTOR: సేవల్లో పారదర్శకత తప్పని సరి: కలెక్టర్‌
Collector talking to people on registration services

బుక్కపట్నం, జనవరి8 (ఆంధ్రజ్యోతి): ప్రజలకందిస్తున్న సేవల్లో పారదర్శకత, సమయ పాలన తప్పకుండా ఉండాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ రిజిసే్ట్రషన అధికారులకు సూచించారు. ఆయన గురువారం మండలకేంద్రంలోని సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో జరుగుతున్న రిజిస్టేషన ప్రక్రియ, దస్తాల నిర్వాహణ, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో కలెక్టర్‌ మాట్లాడి, రిజిసే్ట్రషన సమయంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు పనులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలను అనవసరం గా కార్యాలయాల చుట్టూ తిప్పకుండా నిర్ణీత కాలపరిమితిలో సేవలందేలా చర్యలు తీసుకోవా లన్నారు. రిజిసే్ట్రషన ప్రక్రియలో అవకతవకలకు తావులేకుండా, మధ్యవర్తుల జోక్యం లేకుండా ప్రజలకు నేరుగా సేవలందించాలని స్పష్టం చేశారు. కార్యాలయం, పరిసరాల పరిశుభ్రత, రికార్డుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రతి ఉద్యోగి పనిచేయాలన్నారు. ఆయనతో పాటు తహసీల్దార్‌ నరసింహులు, సబ్‌రిజిసా్ట్రర్‌ మురళీక్రిష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 08 , 2026 | 11:47 PM