Share News

MLA RAJU: అభివృద్ధిని గడప గడపకు తీసుకెళ్లాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:50 PM

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎ్‌సరాజు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో అమరాపురం మండలం ఆలదపల్లి పంచాయతీలోని నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశమయ్యారు.

MLA RAJU: అభివృద్ధిని గడప గడపకు తీసుకెళ్లాలి
MLAs and former MLAs warmly welcoming those joining the party

మడకశిర టౌన, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎ్‌సరాజు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో అమరాపురం మండలం ఆలదపల్లి పంచాయతీలోని నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిషత్తులో చేపట్టాల్సిన వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. మండలంలో పార్టీ నిర్మాణం, బలోపేతం అనే అంశాలపై పలు సూచనలు చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, మండల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకొన్నారు. గ్రామంలో పార్టీని పటిష్టం చేయాలని, దుర్మార్గుల దుష్ట పన్నాగాల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా పనిచేద్దామన్నారు. కూటమి ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రాభివృద్ధి, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయన్నారు. త్వరలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. మండల కన్వీనర్‌ కృష్ణమూర్తి, నాయకులు పాల్గొన్నారు.

ఖాళీ కాబోతున్న వైసీపీ: జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోందని ఎమ్మెల్యే ఎంఎ్‌స రాజు అన్నారు. మంగళవారం మణూరుతండాకు చెందిన 200 కుటుంబాలు వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి టీడీపీలోకి చేరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన తన ఐదేళ్ల పాలనలో మడకశిర నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం సహకారం అందించలేదన్నారు. సొంత పార్టీ నేతలతోనే వసూలు చేసిన ఘనత ఆపార్టీ నేతలకే దక్కుతుందన్నారు. కేవలం 18 నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ రాష్ట్రంలోనే ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అనంతరం నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకొన్న 81 మందికి రూ.21లక్షల చెక్కులను ఎమ్మెల్యే ఎం.ఎ్‌స.రాజు అందజేశారు. వక్కలిగ కార్పొరేషన చైర్మన లక్ష్మీనారాయణ, డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, నాగరాజు, కౌన్సిలర్‌ నాగేంద్ర, వడ్డే రఘురాం పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:50 PM