MLA: బాధ్యతాయుతంగా సేవలందించాలి
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:27 PM
క్షేత్రస్థాయిలో ప్రజల కు అత్యంత బాధ్యతతో సేవలందించాలని ఎమ్యెల్యే పల్లె సింధూ ర రెడ్డి ఆశావర్కర్లకు సూచించారు. నూతనంగా నియమితులైన ఏడు గురు ఆశావర్కర్లకు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు నియామక పత్రాలను అందజేశారు.
ఎమ్యెల్యే పల్లె సింధూరరెడ్డి
పుట్టపర్తి రూరల్, జనవరి 7(ఆంద్రజ్యోతి): క్షేత్రస్థాయిలో ప్రజల కు అత్యంత బాధ్యతతో సేవలందించాలని ఎమ్యెల్యే పల్లె సింధూ ర రెడ్డి ఆశావర్కర్లకు సూచించారు. నూతనంగా నియమితులైన ఏడు గురు ఆశావర్కర్లకు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు అమలు చేస్తున్న ఆరోగ్య సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరేలా ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిం చాలన్నారు. అప్పగించిన బాద్యతలను నిబద్ధతతో నిర్వర్తించి ప్రభు త్వానికి మంచిపేరు తీసుకరావాలని కోరారు. డీఏఓ సురేష్‌బాబు, కప్పలబండ సర్పంచు పెద్దన్న, వైద్యులు వెంకటేష్, దీప్తి, భవ్య, నాగదుర్గాదేవి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.