FESTIVAL: ఘనంగా సంక్రాంతి సంబరాలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:54 PM
సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిచేలా జరుపుకునే పండుగ సంక్రాంతి అని డైట్ ఇనచార్జ్ ప్రిన్సిపాల్ రామక్రిష్ణ, విశ్రాంత డీఈఓ మునెయ్య పేర్కొన్నారు. మం డలకేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
బుక్కపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిచేలా జరుపుకునే పండుగ సంక్రాంతి అని డైట్ ఇనచార్జ్ ప్రిన్సిపాల్ రామక్రిష్ణ, విశ్రాంత డీఈఓ మునెయ్య పేర్కొన్నారు. మం డలకేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాత్రో పాధ్యాయులు, అధ్యాపకులు, కాలేజీ ఆవరణంలో రంగవల్లులు వేశారు. సంప్రదాయ వస్ర్తాధారణతో ఘనంగా భోగిమంటలు వేసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు.
సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు.
ధర్మవరం/ఓబుళదేవరచెరువు: ధర్మవరం పట్టణంలోని కాకతీయ విద్యానికేతనలో, ఓబుళదేవరచెరువులోని వశిష్ట ఇంగ్లీష్ మీడి యం పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకు న్నారు. కాకతీయ విద్యానికేతనలో విద్యార్థులకు రంగవల్లుల పోటీలు ని ర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ నిర్మలాదేవి, డైరెక్టర్‌లు శెట్టిపి సూర్యప్రకాశరెడ్డి, పద్మ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వశిష్ట ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరస్పాండెంట్ పిట్ట శివశంకర్‌రెడ్డి విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నా యి. ప్రిన్సిపాల్ షింటో, డైరెక్టర్ సుమలి, అమానుల్లా, పవిత్ర, ఆశాది, పూజ, సాహిస్త, గంగప్ప, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....