Share News

NMU: సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:38 PM

కడప జోన పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎనఎంయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ఎర్రబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు.

NMU: సమస్యలను వెంటనే పరిష్కరించాలి
NMU leaders holding dharna in front of Dharmavaram depot

ఎర్రబ్యాడ్జీలు ధరించి ఎనఎంయూ నాయకుల ధర్నా

ధర్మవరం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): కడప జోన పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎనఎంయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ఎర్రబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ యూనియన రీజనల్‌ చైర్మన ముత్యాలప్ప మాట్లాడుతూ... డిపోలోని సమస్యలను అధికారులకు తెలియజేసినా స్పందించడం లేదన్నారు. కడప జోనలోని అన్ని డిపోలలో ఉద్యోగ భద్రత సర్క్యులర్‌ 1/19ను వెం టనే అమలు చేయాలన్నారు. గ్యారేజీలలో అసిస్టెంట్‌ మెకానిక్‌, డిప్యూటీ మెకానిక్‌, ఆర్టిజెన్స, రీడిండ్‌ హ్యాండ్‌లకు ఉద్యోగోన్నతులను చేపట్టాల న్నారు.


అన్ని కేటగిరిలలో ఉన్న ఖాళీలను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయాలని, జిల్లా అధికారుల వద్ద ఉన్న అప్పీల్స్‌ అన్నిటినీ సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. మహిళా సిబ్బందికి రెస్ట్‌రూమ్స్‌లలో సరైన వసతులు కల్పించడంతో పాటు జీఓ నెంబరు 70 ప్రకారం చైల్డ్‌కేర్‌ లీవులు మంజూరు చేయాలన్నారు. సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమం లో ఎనఎంయూ రీజనల్‌ నాయకులు ప్రభాకర్‌, జీవై నాగప్ప, దుర్గాప్రసాద్‌, డిపో అధ్యక్ష, కార్యదర్శులు గోపాలప్ప, మధుసూదన, డిపో చైర్మన హనుమాన, గ్యారేజ్‌ అధ్యక్ష, కార్యదర్శులు హరిక్రిష్ణ, ప్రసాద్‌, డిపో నాయకులు వైవీఎనరెడ్డి, ఎంఎం రత్నం పాల్గొన్నారు.

పుట్టపర్తి టౌన: అపరిస్కృతంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్య లను వెంటనే పరిష్కరించాలని మంగళవారం పుట్టపర్తి ఆర్టీసీ డిపో గేటు ఎదుట డిపో అధ్యక్షుడు శివశంకర్‌ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన నిర్వహించారు. నేషనల్‌ మజ్దూర్‌ యూనియన పిలుపుమేరకు ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యూ నియన జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్‌ నాయక్‌, కార్యదర్శి షబ్బీర్‌ మాట్లాడు తూ కడప జోన వ్యాప్తంగా అన్ని డిపోల్లో నెలకొన్న సమస్యలను సా నుకూలంగా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా నాయకులతో పాటు డిపో నాయకులు రవితేజ, అప్పిరెడ్డి, గంగుల య్య, హరికృష్ణ, ఈశ్వరప్ప, శివారెడ్డి, రాజగోపాల్‌, స్వర్ణమ్మ, నాగరత్న మ్మ, కళావతి, సత్యనారాయణ రావు, చిరంజీవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 06 , 2026 | 11:38 PM