DLDO: చెత్త నుంచి ఆదాయం ఎక్కడ? : డీఎల్‌డీఓ
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:42 PM
మండలంలోని పలు పంచా యతీల్లో ఉన్న చెత్త సంపద కేంద్రాల ఆదాయం ఎక్కడ? అని డీఎల్‌డీఓ అధికారులను ప్రశ్నించారు. గాండ్లపెంట మండలం లోని సచివాలయాల తనిఖీలో భాగంగా ఆయన మంగళవారం మండల కేంద్రంలోని సచివా లయాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు.
గాండ్లపెంట, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు పంచా యతీల్లో ఉన్న చెత్త సంపద కేంద్రాల ఆదాయం ఎక్కడ? అని డీఎల్‌డీఓ అధికారులను ప్రశ్నించారు. గాండ్లపెంట మండలం లోని సచివాలయాల తనిఖీలో భాగంగా ఆయన మంగళవారం మండల కేంద్రంలోని సచివా లయాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. ప్రతి స చివాలయ ఉద్యోగి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిం చాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు లబ్ధిదారు లకు చేరవేసే బాధ్యత సచివాలయ ఉద్యోగుల పైనే ఉంటుందన్నారు. అనంతరం మండల కేంద్రంలోని చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. తప్పనిసరిగా చెత్తను సందద తయారీ కేంద్రాలకు తరలించి, దాని నుంచి సందప సృష్టించే బాధ్యత పంచాయతీ అధికారులపై ఉందని సూచించారు. ఎంపీడీఓ రామకృష్ణ, ఈఓఆర్డీ సునీత పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....