PHCs: శిథిల భవనాల్లో ప్రజారోగ్యం
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:27 PM
వైద్యానికి ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నా... మండలంలోని చాలా ఆరోగ్య కేం ద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఓబు ళదేవరచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం పైకప్పు పెచ్చు లూడి పడుతుండటంతో అధికారుల ఆదేశాల మేరకు తప్పని పరిస్థితు ల్లో ల్యాబ్ నిర్వహిస్తున్న గదిలోకి మార్చారు.
ఒకే గదిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
పెచ్చులూడిన భవనాల్లోనే ఉపకేంద్రాలు
ఇబ్బందులు పడుతున్న రోగులు, సిబ్బంది
ఓబుళదేవరచెరువు, జనవరి 5(ఆంధ్రజ్యోతి): వైద్యానికి ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నా... మండలంలోని చాలా ఆరోగ్య కేం ద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఓబు ళదేవరచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం పైకప్పు పెచ్చు లూడి పడుతుండటంతో అధికారుల ఆదేశాల మేరకు తప్పని పరిస్థితు ల్లో ల్యాబ్ నిర్వహిస్తున్న గదిలోకి మార్చారు. అయితే అక్కడున్న ఒక గది లోనే వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతు న్నా రు. అలాగే మండలంలో 12 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా గౌనిపల్లి, ఓడీసీ -1, కొండకమర్ల -1 ఆరోగ్య ఉపకేంద్రాలు శిథి లావస్థకు చేరాయి. మిగిలిన తొమ్మిది ఉపకేంద్రాలను అగ్దె భవనాల్లోనే కొనసాగి స్తున్నారు.
చాలీచాలని గదిలోనే వైద్య సేవలు
మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి గత వైసీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరయ్యాయి. దీంతో భవన నిర్మాణం కోసం వైద్యశాల ఆవరణంలో ఉన్న చెట్లను తొలగించి భూమిని చదును చేశా రు. ఆ తర్వాత నాలుగు, ఐదు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రా క్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో మంజూరైన నిధులు వెనక్కి వె ళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో సీహెచసీ నిర్మాణం మండల ప్రజలకు కలగానే మిగిలిపోయింది. వైద్యశాల శిథిలావస్థకు చేరుకో వడంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నూతనంగా నిర్మించిన ల్యాబ్ గదిలోనే ీనిర్వహిస్తున్నారు.
అయితే ఒకే ఒక్క గదిలో నాలుగు మంచాలు మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో అత్యవసర సమయాల్లో రోగులు ఎక్కువైనప్పుడు మంచానికి ఇద్దరు, ముగ్గురిని ఉంచి వైద్య సే వలు అందించాల్సి వస్తోంది. నెల క్రితం బత్తినపల్లిలో కలుషిత ఆహా రం తిని 25 మంది అస్వస్థతకు గురైతే, వైద్య సిబ్బంది వసతులులేని ఆ ల్యాబ్ గదిలోనే అతికష్టం మీద వైద్యసేవలు అందించాల్సి వచ్చింది.
భయం... భయంగా విధులు
మండలంలోని గౌనిపల్లి, ఓబుళదేవరచెరువు -1, కొండకమర్ల - 1 ఆరోగ్య ఉపకేంద్రాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వైద్య సిబ్బంది భ యం భయంగా విధులు నిర్వహించాల్సి వస్తోంది. గౌనిపల్లి ఉపకేం ద్రంలో పైకప్పు పెచ్చులూడి కడ్డీలు దర్శనమిస్తున్నాయి. ఉపకేంద్రం బయట సనసైడ్ పిల్లర్లు కూడా శిథిలావస్థకు చేరుకొని కడ్డీలు దర్శన మిస్తున్నాయి. వీటికి తోడు చుట్టూ కంపచెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి విషపురుగులు సైతం ఉపకేంద్రంలోకి వస్తున్నాయి. ఇదే పరిస్థితి ఓబుళదేవరచెరువు-1, కొండకమర్ల-1లో ఉపకేంద్రాల్లో నెలకొంది. ఈ విషయం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు తెలిసినా ఏ మాత్రం పట్టిం చుకోలేదన్న విమర్శలు వినిపిన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉపకేంద్రాలకు కూటమి ప్రభుత్వంలో అయినా నూతన భవనాలను నిర్మించాల ని మండల ప్రజలు కోరుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి గతంలో పరిశీ లించి నూతన భవనం మంజూరు విషయమై జిల్లా ఉన్నతాధికారులతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి అప్పట్లో తీసుకెళ్లారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
- డాక్టర్ భాను ప్రకాష్ నాయక్, మండల వైద్యాధికారి
శిథిలావస్థకు చేరుకున్న ఆరోగ్య కేంద్రం, ఉపకేంద్రాల సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం టెండర్ పిలిచే దశలో ఉంది. గౌనిపల్లి, కొండకమర్ల, ఓబులదేవర చెరువు ఉపకేంద్రాలకు పక్కా భవనాలు మంజూరయ్యాయి. వాటికి స్థల పరిశీలన కూడా చేశాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....