Home » Puttaparthy
పేరు గొప్ప....ఊరుదిబ్బ అన్న చందంగా మారింది కొత్త చెరువు మండల కేంద్రం పరిస్థితి. ఇది జిల్లా కేం ద్రానికి ముఖద్వారం వలె ఉంది. అయితే మండల కేంద్రంలో బస్టాండ్ ఉ న్నా నాలుగురోడ్ల కూడలి కి దూరంగా ఉండడంతో ఎవరూ అక్కడికి వెళ్లరు. దీంతో బస్సులు కూడా అక్కడికి వెళ్లవు.
టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30 వ వర్ధంతిని టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల ఆధ్వ ర్యంలో ఆదివారం నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఆయన విగ్రహాల కు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
మండలంలో ప్రసిద్ధి చెం దిన పాలపాటిదిన్నె ఆం జనేయస్వామి ఆలయం శనివారం భక్తులతో కిట కిటలాడింది. ఈ సంద ర్భంగా అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా అలం కరించి పూజలు చేశారు.
సత్యసాయి విద్యార్థులు చేప ట్టిన గానకచేరి భక్తులను అలరింపజేసింది. సంక్రాంతి సంబరాల సందర్భంగా బెంగళూరు బృందావన, చిక్ బళ్లాపూర్ నందగిరి విద్యా ర్థులు బుధవారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో ప్రేమామృతం పేరిట గాన కచేరి ని ర్వహించా రు.
వైసీపీ హయాంలో పల్లెల్లో అభివృద్ధి అటకెక్కింది. రోడ్లు అధ్వానంగా మారాయి. మట్టి రోడ్లే దిక్కయ్యాయి. మండలంలోని చాలా గ్రామాలు.. సీసీ రోడ్లకు నోచుకోలేదు. మట్టి రోడ్లలో గ్రామీణులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాలువలు కూడా లేవు. రోడ్లపైనే మురుగు నీరు ప్రవహిస్తోంది. మట్టిరోడ్ల గుంతల్లో ఆ నీరు నిల్వ ఉంటుండడంతో జనం నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజల సంతృప్త స్థాయి పెరిగేలా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలను త్వరితగతిన నాణ్యంగా పరిష్కరించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది.
మండల కేంధ్రం సమీపం లోని ధర్మవరం ప్రధాన రహదారి పక్కన సర్వే నెంబరు-384లో 273 మందికి గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలను పంపిణీచేశారు. ఈ లే అవుట్ ధర్మవరం ప్రధాన రహదారికి సమీపంలో ఉడడంతో ఇక్కడి ఇళ్ల ప్లాట్‌లకు మంచి డిమాండ్ ఉంది.
పోరాట యోధుడు వడ్డె ఓబన్న అని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలను కొత్తచెరువు మండల కేంద్రంలోని వడ్డె ఓబన్న విగ్రహం వద్ద ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి పాల్గొని వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
స్థానిక కలెక్టరేట్‌లో ఆదివారం స్వాతంత్య్ర సరమయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలనుు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్, ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి రాజేంద్ర రెడ్డి, వడ్డెర సంఘాల నాయకులు పాల్గొని వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిద్దాం... లోపాలను సరిచేసుకుని సమష్టిగా పనిచేసి తల్లీబిడ్డలను కాపాడుకుందామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఫైరోజ్‌బేగం పేర్కొన్నారు. స్థానిక సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో గురువారం మాతాశిశు మరణాలపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.