DMHO: తల్లీబిడ్డలను కాపాడుకుందాం: డీఎంహెచవో
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:57 PM
ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిద్దాం... లోపాలను సరిచేసుకుని సమష్టిగా పనిచేసి తల్లీబిడ్డలను కాపాడుకుందామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఫైరోజ్‌బేగం పేర్కొన్నారు. స్థానిక సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో గురువారం మాతాశిశు మరణాలపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
పుట్టపర్తి రూరల్, జనవరి 8 (ఆంద్రజ్యోతి): ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిద్దాం... లోపాలను సరిచేసుకుని సమష్టిగా పనిచేసి తల్లీబిడ్డలను కాపాడుకుందామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఫైరోజ్‌బేగం పేర్కొన్నారు. స్థానిక సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో గురువారం మాతాశిశు మరణాలపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. జిల్లాలోని వివిధ ఆసుపత్రులలో డిసెంబరు నెలలో సంభవించిన ఏడు శిశుమరణాలపై సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్బంగా డీఎంహెచవో మాట్లాడుతూ... ప్రతిఒక్కరు మనం తల్లీబిడ్డను కాపాడుకోవడానికే పనిచేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సిబ్బంది అందరూ తప్పనిసరిగా వారి వారి స్థాయిలో అవసరమైన సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో యయ జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ నాగేంద్రనాయక్, డీసీహెచఎస్ డాక్టర్ మధుసూదన తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....